West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత
West Bengal: వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసన
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోల్‌కతాలోని ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఘటనను నిరసిస్తూ పశ్చిమబంగా ఛాత్రో సమాజ్ విద్యార్థి సంఘం నిరసనకు దిగింది. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నబన్నా అభియాన్ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి విద్యార్థులను నియత్రించేందుకు యత్నించారు. హౌరా బ్రిడ్జి వద్ద విద్యార్థులు బారికేడ్లను బద్దలు కొట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు, వాటర్ ఫిరంగులు ప్రయోగించారు. కోల్‌కతాలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.