Puja Khedkar: ఫేక్ సర్టిఫికేట్ వివాదం నేపథ్యంలో ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ శిక్షణ రద్దు

Puja Khedkar: శిక్షణను రద్దు చేస్తు ముస్సోరీలోని నేషనల్ అకాడమీ నిర్ణయం

Update: 2024-07-16 15:30 GMT

Puja Khedkar: ఫేక్ సర్టిఫికేట్ వివాదం నేపథ్యంలో ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ శిక్షణ రద్దు

Puja Khedkar: వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌‌ శిక్షణ రద్దయింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు నకిలీ అంగవైకల్య, ఓబీసీ సర్టిఫికేట్‌లను సమర్పించారనే ఆరోపణల నేపథ్యంలో శిక్షణను రద్దు చేస్తూ ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించింది. ఈ మేరకు పూజా ఖేద్కర్‌కు సమాచారం అందించింది. వివాదం నేపథ్యంలో సర్టిఫికేట్‌ను పరిశీలించాల్సి ఉందని, అందుకే తాత్కాలికంగా శిక్షణను రద్దు చేస్తున్నట్టు లేఖ రాసింది. జిల్లా శిక్షణా కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించామని, ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం అందించామని లేఖలో పేర్కొంది.

Tags:    

Similar News