దేశానికి జమిలి ఎన్నికలు అవసరం : ప్రధాని మోడీ

Update: 2020-11-26 12:30 GMT

ప్రధాని మోడీ నోట మరోసారి జమిలి ఎన్నికల మాట వినిపించింది. దేశానికి జమిలి ఎన్నికల అవసరముందన్న మోడీ, ఒకే దేశం - ఒకే ఎన్నికపై అధ్యయనం జరగాల్సిందేనన్నారు. దేశంలో నిత్యం ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని ఇలా, తరచూ ఎన్నికలు జరుగుతుండటం వల్ల దేశాభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. గ్రామ పంచాయతీ నుంచి లోక్‌సభ ఎన్నికల వరకు ఒకే ఓటర్ల జాబితా ఉండాలన్న మోడీ అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల డబ్బుతోపాటు సమయం కూడా ఆదా అవుతుందన్నారు.

Tags:    

Similar News