NEET UG 2024 Results: నీట్-యూపీ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ జరగలేదు..సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

NEET UG 2024 Results: నీట్-యూజీ కేసులో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరగలేదని, అందువల్ల మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. వైరల్ అయిన టెలిగ్రామ్ వీడియో కూడా ఫేక్ అని పేర్కొంది. అలాగే 2024-25 సంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్ సీట్లకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై మూడో వారం నుంచి నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించింది.

Update: 2024-07-11 02:36 GMT

NEET UG 2024 Results: నీట్-యూపీ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ జరగలేదు..సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

NEET UG 2024 Results:నీట్-యూజీ కేసులో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరగలేదని, అందువల్ల మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. వైరల్ అయిన టెలిగ్రామ్ వీడియో కూడా ఫేక్ అని పేర్కొంది. అలాగే మార్కుల ఆధారంగానే 2024-25 సంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్ సీట్లకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై మూడో వారం నుంచి నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించింది. కొన్ని కేంద్రాల్లో విద్యార్థులు లబ్ది పొందేలా అక్రమాలు జరిగాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు తెలిపింది. మద్రాస్ ఐఐటీ నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాల డేటా విశ్లేషణలో మార్కుల పంపిణీలో అసాధారణ అంశాలేవీ కనిపించలేదని కేంద్రం పేర్కొంది.

పరీక్షల ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకు, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చేసేందుకు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి, పరీక్షను పారదర్శకంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా సమర్థవంతమైన చర్యలను సిఫారసు చేసేందుకు నిపుణులను సంప్రదించామని కేంద్రం తెలిపింది.పేపర్ల తరలింపును పక్కాగా పరిశీలిస్తున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. భవిష్యత్తులో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించింది.

ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం నాడు వివాదాస్పదమైన వైద్య ప్రవేశ పరీక్ష NEET-UG 2024కు సంబంధించిన పిటిషన్లను విచారించనుంది. పరీక్షలో అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తూ, దానిని మళ్లీ నిర్వహించాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో MBBS, BDS, ఆయుష్, ఇతర సంబంధిత కోర్సులలో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 5న NEET-UG పరీక్షను నిర్వహించింది. దేశంలోని మొత్తం 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ఇందులో దాదాపు 23.33 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షలో అవకతవకలపై దేశవ్యాప్తంగా అనేక చోట్ల విద్యార్థులు ప్రదర్శనలు చేశారు. అంతేకాదు అభ్యర్థులు సుప్రీంకోర్టుకు కూడా ఆశ్రయించారు. ఆ తర్వాత కేంద్రం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.

Tags:    

Similar News