Modi Sarkar: మహిళలకు మోదీ సర్కార్ సూపర్ ఛాన్స్..రూ. 80వేల వరకు ఆదాయం పొందే అవకాశం

Modi Sarkar: మహిళలకు మేలు చేసే విధంగా కేంద్రంలోని మోదీ సర్కార్ క్రిషి శక్తి యోచన అమలు చేయనున్నట్లు సమాచారం. స్త్రీలు కూడా వ్యవసాయంలో నిమగ్నమయ్యే విధంగా..వారితో జోవనోపాధిని మెరుగుపర్చుకునేలా, మహిళలకు ఉద్యోగాలు కల్పించడానికి ఈ పథకాన్ని అమలు చేయనుంది కేంద్రం .

Update: 2024-07-11 02:21 GMT

 Maharashtra: డిగ్రీ పూర్తి చేస్తే నెలకు రూ.10వేలు..నిరుద్యోగ యువత కోసం కొత్త స్కీం

Modi Sarkar:కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రైతులకు మేలు చేసే విధంగా పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇటు రాష్ట్రంలోనూ రైతు బంధు పథకం పేరుతో అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాకాలం నుంచి రైతు బంధు పేరు రైతు భరోసాగా మార్చి రూ. 15వేలు రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో జిల్లాల వారీగా సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు ఈసారి కౌలు రైతులకు కూడా అమలు చేయనుంది ప్రభుత్వం.

అయితే మహిళలకు మేలు చేసే విధంగా కేంద్రంలోని మోదీ సర్కార్ క్రిషి శక్తి యోచన అమలు చేయనున్నట్లు సమాచారం. స్త్రీలు కూడా వ్యవసాయంలో నిమగ్నమయ్యే విధంగా..వారితో జోవనోపాధిని మెరుగుపర్చుకునేలా, మహిళలకు ఉద్యోగాలు కల్పించడానికి ఈ పథకాన్ని అమలు చేయనుంది కేంద్రం .దీనిని కృషి సఖి ప్రాజెక్టు లక్పతి దీదీ యోజన కింద అమలు చేయనున్నారు. మహిళల ఆర్థిక పరిస్థతిని మెరుగుపర్చుకోవడానికి ఈ స్కీం ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలో ఎక్కువగా వ్యవసాయ పనులకు భూమిని సిద్ధం చేయడానికి ట్రైనింగ్ ఇస్తారు.

మీకు కావాలంటే పలు రకాల వ్యవసాయ పనులు కూడా నేర్పిస్తారు. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం మహిళా రైతులను వ్యవసాయంలో నిపుణులను చేయడం.  గ్రామాల్లోని మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకుని వ్యవసాయంలో మహిళలు  నిష్ణాతులు కావాలనేది కేంద్రం ప్రభుత్వం  ఆలోచన. దీనిద్వారా వారు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. మహిళల ఆదాయం కూడా పెరిగితే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువస్తున్నారు. దీని ద్వారా మహిళలకు ఏడాదికి రూ. 60వేల నుంచి రూ. 80వేల వరకు ఆదాయం పొందుతారు. దీంతో మహిళలు స్వతహాగా ఎదిగేందుకు ఈ స్కీం ఎంతగానో ఉపయోగపడుతుంది. 

Tags:    

Similar News