Lockdown: ఢిల్లీ, యూపీలో లాక్‌డౌన్ పొడిగింపు
Lockdown: ఈనెల 17 వరకు లాక్‌డౌన్ * కరోనా కేసులు పెరుగుతుండటంతో నిర్ణయం
Lockdown: యూపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను ఈనెల 17 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా సెకెండ్ వేవ్‌లో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో లాక్‌డౌన్‌ను ఈనెల 17వ తేదీ వరకూ పొడిగించారు. తాజా లాక్‌డౌన్‌తో మే 17వ తేదీ వరకూ కరోనా కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. ఈ కాలంలో అన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసే ఉంటాయని చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సర్వీసుల కింద బయటకు వెళ్లాల్సి వస్తే ఇ-పాస్‌లు తప్పనిసరిగా పొందాలని పేర్కొంది.
ఇక ఢిల్లీలో కూడా మరోసారి లాక్‌డౌన్ పొడిగించారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో కేజ్రీవాల్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఈ నెల 17 వరకు లాక్‌డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.