ఆత్మహత్య చేసుకున్న లేడీ సీఐడీ ఆఫీసర్!
కర్ణాటక సీఐడీ అధికారిణి లక్ష్మి (33) ఆత్మహత్యకి పాల్పడ్డారు. స్నేహితురాలు ఇంట్లో పార్టీకి వెళ్ళిన లక్ష్మి ఆమె ఇంట్లోనే ఆత్మహత్యకి పాల్పడ్డారు. రాత్రి 10:30 గంటల సమయంలో ఆమె ఒక గదిలో ఆత్మహత్య చేసుకొని వేలాడుతూ కనిపించారు.
కర్ణాటక సీఐడీ అధికారిణి లక్ష్మి (33) ఆత్మహత్యకి పాల్పడ్డారు. స్నేహితురాలు ఇంట్లో పార్టీకి వెళ్ళిన లక్ష్మి ఆమె ఇంట్లోనే ఆత్మహత్యకి పాల్పడ్డారు. రాత్రి 10:30 గంటల సమయంలో ఆమె ఒక గదిలో ఆత్మహత్య చేసుకొని వేలాడుతూ కనిపించారు. అయితే ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్టుగా వైద్యులు వెల్లడించారు. 2014 బ్యాచ్ కి చెందిన లక్ష్మి ప్రస్తుతం బెంగుళూరు సీఐడీ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే లక్ష్మి గత కొంత కాలంగా తన భర్తకు దూరంగా ఉంటున్నారు. పెళ్లి అయి ఎనమిది సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు లేకపోవడంతో వేదనకు గురై లక్ష్మి ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలిసులు భావిస్తున్నారు. దీనిపైన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.