Joker Virus: భయపెడుతున్న జోకర్ వైరస్‌.. దీనిని ఓపెన్‌ చేస్తే అంతే సంగతి..

Joker Virus: జోకర్ వైరస్ భయపెడుతోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను గూగుల్‌ ఐదు సార్లు డిలీట్‌ చేసింది.

Update: 2021-06-18 16:30 GMT

Joker Virus: భయపెడుతున్న జోకర్ వైరస్‌.. దీనిని ఓపెన్‌ చేస్తే అంతే సంగతి..

Joker Virus: జోకర్ వైరస్ భయపెడుతోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను గూగుల్‌ ఐదు సార్లు డిలీట్‌ చేసింది. అయితే మెట్రో నగరాలను జోకర్ సాఫ్ట్‌వేర్ ఇప్పటికే తీవ్రంగా కుదిపేస్తోంది. మొబైల్స్‌, డెస్క్‌టాప్‌లో ప్రత్యక్షమవుతూ మొబైల్ సమాచారం మొత్తం హ్యాకర్స్‌కు చేరవేస్తుంది. ఈ జోకర్‌ వైరస్ కోసం పంపే లింక్ క్లిక్ చేస్తే మీ మొబైల్ ఆపరేషన్ మొత్తం హ్యాకర్‌కు వెళ్లి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వడంతో ఈ జోకర్‌ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

జోకర్‌ మాల్‌వేర్‌ చాలా ప్రమాదకరమైన మాల్‌వేర్‌ అని దీనికి అడ్డుకట్ట వేసేందుకు మూడేళ్లపాటు శ్రమించామని గత ఏడాది గూగుల్‌ ప్రకటించుకుంది. కానీ కిందటి ఏడాది జులైలో గూగుల్‌ పే స్టోర్‌లో మళ్లీ జోకర్‌ కదలికలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన గూగుల్‌ కొన్ని అనుమానాస్పద యాప్‌ల్ని ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. అయినప్పటికీ జోకర్‌ భయం పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పుడు మళ్లీ ఆ జోకర్‌ మాల్‌వేర్‌ ఆనవాళ్లను గుర్తించారు.

మీకు క్రిడిట్ కార్డు పై లోన్స్ కావాలా.. మీకు భారీగా లాటరీ వచ్చింది. మీరు పేటియం వాడుతున్నారు క్యాష్ బ్యాక్ వచ్చిందంటూ అట్రాక్ట్ చేస్తూ వాట్సప్‌లో లింక్‌లు వస్తుంటాయి. ఇలాంటి లింక్‌లను ఓపెన్‌ చేశారో ఆ లింకుల్లో దాగి ఉన్న జోకర్‌ వైరస్ గుట్టు చప్పుడు కాకుండా మీ మొబైల్‌లోకి వచ్చి చేరుతుంది. ఇదే కాదు మీ మొబైల్‌లో వైరస్ ఉంది అంటూ యాంటీ వైరస్ డౌన్లోడ్ చేసుకొండి అంటూ కూడా వచ్చే లింక్‌ల ద్వారా జోకర్‌ వైరస్ మొబైల్‌లో చేరి మన మొబైల్‌లో ఉన్న ప్రతి సమాచారాన్ని హ్యాకర్‌కు చేరవేస్తుంది.

ఈ వైరస్ కొన్ని యాప్స్ ద్వారా కూడా వస్తుందని ప్లే స్టోర్‌లో అనుమానిత యాప్స్‌ను తొలగించింది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ను గూగుల్‌‌లో జోకర్‌ వైరస్ ఆనవాళ్లు కనిపించడంతో సైబర్ క్రైం పోలీసులకు కొన్ని ఫిర్యాదులు రావడంతో జోకర్‌ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

జోకర్‌ అనేది ఒక మొండి మాల్‌వేర్‌. యూజర్‌కు తెలియకుండానే రెప్పపాటులో డబ్బులు మాయం చేయడంలో దిట్ట. డ్రాయిడ్‌ యూజర్‌పై యాడ్స్‌ రూపంలో ఈ మాల్‌వేర్‌ దాడి చేస్తుంది. మెసేజ్‌లు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లు, పేమెంట్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోగలుగుతుంది. ఒకవేళ ట్రాన్సక్షన్‌ అయినట్లు యూజర్‌కు మెసేజ్‌ వచ్చినా అప్పటికే ఆలస్యం జరిగిపోయి ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది. కాబట్టి, యాడ్‌లను క్లిక్‌ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News