Mumbai Rains: ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు..ఐఎండీ రెడ్ అలర్ట్..స్కూళ్లకు సెలవు

Mumbai Rains:ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం కురిసిన భారీ వర్షానికి నగరం మొత్తం స్తంభించింది. మంగళవారం కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ జారీ చేసింది.

Update: 2024-07-09 05:19 GMT

Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు

Mumbai Rains:భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలం అవుతోంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి నగరం స్తంభించిపోయింది. అయితే ఇవాళ (మంగళవారం) కూడా ముంబైలో భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా ముంబై, థానే, నవీ ముంబై, పన్వెల్, పూణెతోపాటు రత్నగిరి-సింధు దుర్గ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లకు, కాలేజీలకు మంగళవారం సెలవు ప్రకటించారు. కాగా ముంబై యూనివర్సిటీలో ఈరోజు జరగవల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.

సోమవారం తెల్లవారుజామున 1 గంటల నుంచి ఉదయం 7 గంటలకు వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరమంతా స్తంభించిపోయింది. కేవలం 7గంటల వ్యవధిలోనే సుమారు 300 మి.మీటర్లకుపైగానే వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో నగరం మొత్తం జలదిగ్భంధంలోకి వెళ్లింది. రోడ్లన్నీ నదులను తలపించాయి. పలు ప్రాంతాల్లో కార్లు, బైక్ లు నీళ్లపై తేలాడాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి కూడా నీరు చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షం కారణంగా రైలు, విమాన సర్వీసులపై కూడా తీవ్ర ప్రభావం పడింది. పాఠశాలలను కూడా మూసివేశారు. మరోవైపు భారీ వర్షాలకు షార్ట్ సర్య్కూట్ కారణంగా ఓ మహిళ మరణించింది.

Tags:    

Similar News