Hindenburg- Adani Group: హిండెన్ బర్గ్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి...ఖండించిన సెబీ చీఫ్..కుట్రపూరిత చర్యగా పేర్కొన్న అదానీ గ్రూప్

Hindenburg- Adani Group: అమెరికన్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజా రిపోర్టులో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చైర్ పర్సన్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ఆదివారం ఉదయం, సెబీ చీఫ్ మాధబి పూరీ బుచ్ వివరణ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవిగా ఆమె ఖండించారు.

Update: 2024-08-11 09:53 GMT

 Hindenburg Research : మాధబి బచ్ పై హిండెన్ బర్గ్ మరిన్ని ఆరోపణలు..సెబీ చీప్ స్పందనపై వరుస ట్వీట్లు

Hindenburg: అమెరికన్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజా రిపోర్టులో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చైర్ పర్సన్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ఆదివారం ఉదయం, సెబీ చీఫ్ మాధబి పూరీ బుచ్ వివరణ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవిగా ఆమె ఖండించారు. ఈ ఆరోపణలు తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా ఉన్నాయని ఆమె నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అలాగే హిండెన్ బర్గ్ నివేదికను తోసి పుచ్చుతూ అదానీ గ్రూప్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. హిండెన్‌బర్గ్ తాజాగా విడుదల చేసిన రిపోర్టులో వాదన పూర్తిగా కుట్రపూరితమైనదని అదే విధంగా అందులో నిరాధారమైన ఆరోపణలు ఉన్నాయని, సంస్థ పరపతిని తగ్గించేందుకే హిండెన్ బర్గ్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఆరోపించింది.

అదానీ గ్రూప్ హిండెన్ బర్గ్ ఆరోపణలను తోసి పుచ్చింది:

ఇదిలా ఉంటే హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలను అదాని గ్రూప్ తోసిపుచ్చింది. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నివేదికలో ఉన్న ఆరోపణలన్నీ కూడా దురుద్దేశపూర్వకంగా ఉన్నాయని, అలాగే వాస్తవాలన్నిటిని తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని అందుకే ఈ ఆరోపణలను అన్నిటిని కూడా తాము పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు అదాని గ్రూప్ విడుదల చేసిన లేఖలో తెలిపింది. ఇవి కేవలం తమ పరువు తీయడానికి ఉద్దేశించిన వాదనలు మాత్రమే అని తోసిపుచ్చింది. అదానీ గ్రూప్ తరపున, గతంలో చేసిన ఈ ఆరోపణలన్నింటినీ క్షుణ్ణంగా విచారణ జరిగిందని, ఈ ఆరోపణలు అన్నీ కూడా నిరాధారమైనట్లు రుజువైందని తెలిపారు. కాగా తమపై వచ్చిన ఆరోపణలను 2024 జనవరిలో సుప్రీంకోర్టు తిరస్కరించిందని కూడా గుర్తు చేశారు.

హిండెన్‌బర్గ్ ఎలాంటి ఆరోపణలు చేశారు?

ఇదిలా ఉంటే తాజాగా అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ శనివారం విడుదల చేసిన రిపోర్టులో కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. ఇందులో ప్రధానంగా అదానీ గ్రూప్, సెబీ చైర్ పర్సన్ మధాబి పూరీ బుచ్ మధ్య లావాదేవీలు జరిగాయని, విజిల్‌బ్లోయర్ నుండి పొందిన పత్రాల్లో అదానీ సంస్థల షేర్ల విలువను కృత్రిమంగా పెంచేందుకు, సమకూర్చడానికి ఆఫ్‌షోర్ అకౌంట్లను ఉపయోగించారని, ఈ విదేశీ అకౌంట్లను గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నడుపుతున్నట్లు, ఈ అకౌంట్లలో సెబీ చీఫ్ కూడా వాటాలు ఉన్నట్లు ఆరోపించింది.

ఈ రిపోర్టుల్లో వినోద్‌ అదానీ నియంత్రణలో ఆఫ్‌షోర్‌ బెర్ముడా, మారిషస్‌ ఫండ్స్ లో మాధబి పురి బుచ్ అలాగే, ఆమె భర్త ధవల్‌ బచ్‌లకు సైతం వాటిలో వాటాలు ఉన్నాయని ఆరోపణల్లో పేర్కొన్నారు. జూన్ 5, 2015న సింగపూర్‌లోని ఐపీఈ ప్లస్ ఫండ్ 1లో సెబీ చీఫ్ మాదాబి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ తమ ఖాతాను తెరిచినట్లు నివేదిక పేర్కొంది. ఈ జంట మొత్తం పెట్టుబడి 10 మిలియన్ డాలర్లుగా అంచనా వేసింది.

Tags:    

Similar News