Hindenburg Research : మాధబి బచ్ పై హిండెన్ బర్గ్ మరిన్ని ఆరోపణలు..సెబీ చీప్ స్పందనపై వరుస ట్వీట్లు
Hindenburg Research : సెబీ చీఫ్ మాధబి బచ్ పై హిండెన్ బర్గ్ సరికొత్త ఆరోపణలను చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి ఎక్స్ లో పలు పోస్టు చేసింది.
Hindenburg Research : తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ సెబీచీప్ మాధబి బచ్ చేసిన ప్రకటన సంక్లిష్ట ప్రశ్నలు లేవనెత్తుతోందని అమెరికాకు చెందిన షార్ట్ సెల్లార్ హిండెన్ బర్గ్ పేర్కొంది. సెబీ చీఫ్ స్పందనపై ఆ సంస్థ ఆదివారం రాత్రి మరోసారి సోషల్ మీడియా వేదికగా ద్వారా స్పందించింది. మాధబి స్పందనలో ఆమెకు బెర్మడా, మారిషస్ ఫండ్స్ ఉన్నాయన్న విషయాన్ని తెలుపుతున్నాయని పేర్కొంది. దీంతోపాటు ఆ ఫండ్స్ ను ఆమె భర్త ధావల్ మిత్రుడు నడుపుతున్న విషయం కూడా తేలిందని పేర్కొంది. ప్రస్తుతం అతడు అదానీ గ్రూపులో డైరెక్టర్ గా చేస్తున్నారని వెల్లడించింది.
అదానీ విషయంలో దర్యాప్తు చేసే బాధ్యతను సెబీకి అప్పగించారు. వాటిల్లో బచ్ పర్సనల్ పెట్టుబడులు, ఇతర స్పాన్సర్ల నిధులు ఉన్నాయని తెలిపింది. ఇది విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తుందని ఆరోపించింది. సెబీలో నియామకంతో ఆమె 2017లో స్థాపించిన కంపెనీలు నిద్రాణం అయ్యాయని పేర్కొంది. 2019లో ఆమె భర్త సదరు సంస్థల బాధ్యతలను స్వీకరించారని వెల్లడించింది. ఆ కంపెనీ ఇప్పటికీ మాధబి సొంత కంపెనీగానే హిండెన్ బర్గ్ పేర్కొంది. కన్సల్టెంగ్ రెవెన్యూను అది సంపాదిస్తున్నట్లు వెల్లడించింది.
మాధబి పురి బచ్ పై హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థ షేర్ల విలువలు క్రుత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్స్ లో మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్ బర్గ్ ఆరోపించింది. అదానీకి చెందిన మారిషస్, ఆఫ్ షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపించపోవడం తమను ఆశ్చర్యానికి గురించేసిందని పేర్కొంది.
ఈ ఆరోపణలను సెబీ చైర్ పర్సన్ మాధమి పురి బచ్ ఖండించారు. హిండెన్ బర్గ్ ఆరోపణలను ఖండిస్తూ మాధబి, ఆమె భర్త ధావల్ బచ్ ఓ ప్రకటన విడుదల చేశారు. హిండెన్ బర్గ్ ఆరోపణలు ఆధారరహితమని..ఎలాంటి నిజాలేవన్నారు. మా జీవితం ఆర్థిక అంశాలు తెరిచిన పుస్తకంవంటివి. అదానీ గ్రూప్ పై సెబీ విచారణ జరిపిన తర్వాత హిండెన్ బర్గ్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి ప్రతిస్పందనగా మా వ్యక్తిత్వ హసనానికి ఆ సంస్థ పాల్పడటం చాలా బాధకరం అన్నారు.