Hindenburg: అదానీ అక్రమ లావాదేవీలకు వాడిన విదేశీ కంపెనీలలో సెబీ చైర్మన్ వాటా ఉందని ఆరోపించిన హిండెన్‌బర్గ్...

Hindenburg: ఉదయం నుంచి ఊరిస్తూ వచ్చిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ ట్వీట్... ఇప్పుడు ఏకంగా పెద్ద తలకాయనే లక్ష్యంగా చేసుకొని బాంబులు పేల్చింది. సెక్యూరిటీ మార్కెట్లను కంట్రోల్ చేసే సెబి చైర్ పర్సన్ టార్గెట్ చేస్తూ హిండెన్ బర్గ్ రిసెర్చ్ రిపోర్టు విడుదల చేసింది. అదానీ కుంభకోణంలో సెబీ చైర్ పర్సన్ కు సైతం పాత్ర ఉందని నిరూపించే ప్రయత్నం చేసింది.

Update: 2024-08-11 00:40 GMT

 Hindenburg Research : మాధబి బచ్ పై హిండెన్ బర్గ్ మరిన్ని ఆరోపణలు..సెబీ చీప్ స్పందనపై వరుస ట్వీట్లు

 Hindenburg  :  హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ మరోసారి అదానీ గ్రూపు లక్ష్యంగా పెద్ద బాంబే పేల్చింది. ఓ భారతీయ కంపెనీకి సంబంధించిన మరో పెద్ద వార్త బట్టబయలు కానుందని ముందుగానే హిండెన్ బర్గ్ హెచ్చరించింది. ఆ తరువాత గంటల వ్యవధిలోనే హిండెన్ బర్గ్ ఈసారి ఏకంగా సెబీ చైర్ పర్సన్ ను టార్గెట్ చేస్తూ కొత్త నివేదికను విడుదల చేసింది. అదానీ గ్రూపు స్కామ్‌లో ఉపయోగించిన ఆఫ్‌షోర్ షాడో సంస్థలలో సెబీ ఛైర్ పర్సన్ కు వాటాలు ఉన్నాయని కొన్ని విజిల్‌బ్లోయర్ పత్రాలు సూచిస్తున్నాయని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన నివేదికను బహిర్గతం చేసింది.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన వెబ్‌సైట్‌లో పూర్తి కథనం ప్రచురించి, పలు ఆధారాలతో నివేదికను షేర్ చేసింది. హిండెన్‌బర్గ్ విడుదల చేసిన ఈ తాజా నివేదికలో అదానీ గ్రూప్‌, సెబీ చీఫ్‌కు మధ్య సంబంధం ఉందని తేల్చే ప్రయత్నం చేసింది. ఆ వివరాలున్న పత్రాలను "విజిల్ బ్లోయర్ డాక్యుమెంట్స్"గా అభివర్ణించింది.

అదానీ మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించిన అక్రమ నగదు లావాదేవీల కుంభకోణానికి ఉపయోగించిన విదేశీ నకిలీ సంస్థలలో సెబీ చైర్ పర్సన్ మధాబి పూరీ బుచ్‌కు వాటాలు ఉన్నాయని విజిల్‌బ్లోయర్ అంటే అక్రమాలు జరిగాయంటూ ఉప్పందించే వ్యక్తి లేదా వ్యక్తుల నుంచి పొందిన పత్రాలను ఉటంకిస్తూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఈ ఆరోపణలు చేసింది.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ పేర్కొన్న సమాచారంలో ప్రధానంగా, విజిల్‌బ్లోయర్ డాక్యుమెంట్స్ అని చెబుతున్న వాటిని వివరించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా జూన్ 5, 2015న సింగపూర్‌లోని IPE ప్లస్ ఫండ్ లో మాదాబి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ తమ ఖాతాను తెరిచినట్లు ఈ రిపోర్టులో వెల్లడించారు.

IPE ప్లస్ ఫండ్ అనేది వైర్‌కార్డ్ కుంభకోణంతో ముడిపడి ఉన్న సంపద నిర్వహణ సంస్థ అయిన ఇండియా ఇన్ఫోలైన్ (IIFL) ద్వారా అదానీ డైరెక్టర్ ఏర్పాటు చేసిన ఆఫ్‌షోర్ మారిషస్ ఫండ్. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఈ ఫండ్ ద్వారా భారతీయ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించారు.

ఈ నివేదికలో ఇంకా ఏయే అంశాలున్నాయి, ఈ ఆరోపణలకు ఆధారమైన పత్రాల్లో ఇంకా ఏముందన్నది మరింత లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. ఏమైనా, హిండెన్‌బర్గ్ ఈసారి అదానీతో పాటు సెబీనే టార్గెట్ చేయడం విస్మయం కలిగిస్తోంది. అంతేకాదు, సెబీ చైర్మన్ ప్రమేయం ఉంది కాబట్టే గతంలో అదానీపై చేసిన ఆరోపణలపై సెబీ సమగ్ర విచారణకు సిద్ధం కాలేకపోయిందనే అనుమానాలను కూడా హిండెన్ బర్గ్ తన తాజా రిపోర్టులో వ్యక్తం చేసింది.

సెబీ చీఫ్, ఆమె భర్త ధవల్ బుచ్‌కు ఆఫ్‌షోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్స్‌లో కూడా వాటాలు ఉన్నాయని నివేదికలో పేర్కొంది. సెబీ చైర్మన్ మధాబి పూరీ బుచ్‌కి, అదానీ గ్రూప్‌కు మధ్య ఏదో సంబంధం ఉందని అర్థం చేసుకోవచ్చంటూ నివేదికలో తెలిపింది.

బిలియనీర్ గౌతమ్ అదానీ నియంత్రణలో ఉన్న అదానీ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని జనవరి 2023లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ షాకింగ్ నివేదికను విడుదల చేసింది. ఆ తర్వాత అదానీ గ్రూప్ షేర్లు దాదాపు 86 బిలియన్ డాలర్ల మేర పడిపోయాయి. షేరు ధరలో ఈ భారీ పతనం తరువాత గ్రూప్ ఓవర్సీస్ లిస్టెడ్ బాండ్లలో సైతం భారీ అమ్మకాలు జరిగాయి. అయితే అదానీ గ్రూపుపై ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్‌కు సెబీ నోటీసులు కూడా జారీ చేసింది.

Tags:    

Similar News