Hardik Pandya: భార్యతో విడాకుల రూమర్స్..నాలుగేండ్ల బంధం ముగిసిందన్న పాండ్యా

Hardik Pandya: భారత ఆలౌరౌండర్ హార్థిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్ తో బంధానికి వీడ్కోలు చెప్పేశాడు. నటాషా, పాండ్యాల విడాకుల చర్చలు చాలా కాలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో పాండ్యా పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.

Update: 2024-07-18 23:59 GMT

 Hardik Pandya: భార్యతో విడాకుల రూమర్స్..నాలుగేండ్ల బంధం ముగిసిందన్న పాండ్యా

Hardik Pandya:టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా, తన భార్య నటాషాతో రిలేషన్ పై మౌనం వీడారు. హార్థిక్ పాండ్యా, నటాషాల విడాకుల చర్చలు చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ చర్చలకు హార్థిక్ పాండ్యా ముగింపు పలికారు. తన భార్య నటాషాతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు హార్థిక్ పాండ్యా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇద్దరూ విడిపోతున్నారని జరుగుతున్న ప్రచారం ముగుస్తున్న సమయంల హార్థిక్ పాండ్యా షాకింగ్ విషయాన్ని చెప్పారు. భార్య నటాషాతో తాను విడాకులు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నానంటూ చెబుతూ పోస్టు పెట్టాడు. అందులో ఇలా రాస్తూ...నాలుగేండ్లు కలిసి జీవిస్తున్న నటాషా తాను విడిపోవాలని నిర్ణయించుకున్నామని కుండబద్దలు కొట్టేశాడు. నటాషాతో వైవాహిక జీవితం నుంచి విడిపోతున్నట్లుగా టీమిండియా క్రికెటర్ పాండ్యా తెలియజేస్తూ పోస్టు చేశాడు.

కలిసి జీవించేందుకు తామిద్దరం చాలా ప్రయత్నం చేశామని కానీ ఈ నిర్ణయం మా ఇద్దరికీ మంచిదని భావించిన తర్వాతే ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లుగా తెలిపాడు. ఈ నిర్ణయం తీసుకోవడం మాకు కష్టంగా ఉందన్నారు. ఎందుకంటే ఈ సంబంధం నుంచి మాకు ఆనందం, గౌరవం లభించాయని తెలిపాడు. ఈ అసోసియేషన్ ద్వారా మేము ఒక ఫ్యామిలీగా జీవించాము. మా ఇద్దరికీ ఎప్పటికీ కేంద్రంగా ఉండే ఆగస్త్యూడిని పొందాము. అతన్ని సంతోషపెట్టేందుకు మేమిద్దరం అన్నీ ఇస్తామని కొడుకు బాధ్యతను కూడా గుర్తు చేశాడు పాండ్యా.

ఈ క్లీష్టసమయంలో మాకు మద్దతు ఇవ్వాలని అలాగే మా వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము అంటూ హార్థిక్ తన పోస్టులో పేర్కొన్నాడు. కాగా కోవిడ్ సమయంలో పాండ్యా, నటాషా నిశ్చితార్థం జరిగింది. 2020 తర్వాత వారికి కొడుకు పుట్టాడు. బాబు పేరు అగస్త్య. కొన్నిరోజుల క్రితం నటాషా తన పేరు నుంచి పాండ్యా పేరును మార్చేసింది. పాండ్యాతో ఉన్న ఫొటోలను కూడా తొలగించింది. అప్పటి నుంచి వారిద్దరూ విడాకులు తీసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. కాగా నటాషాతో విడాకులు తీసుకున్నట్లు పాండ్యా అధికారికంగా పోస్టు చేశారు. 



Tags:    

Similar News