రైల్వే ప్రయాణికులకి అలర్ట్‌.. టికెట్‌ తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని మరిచిపోవద్దు..!

రైల్వే ప్రయాణికులకి అలర్ట్‌.. టికెట్‌ తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని మరిచిపోవద్దు..!

Update: 2022-11-04 13:29 GMT

రైల్వే ప్రయాణికులకి అలర్ట్‌.. టికెట్‌ తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని మరిచిపోవద్దు..!

Indian Railway: ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం ఒక్క రూపాయితో ప్రయాణికులకి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ని అందిస్తోంది. రైలు ప్రయాణంలో ప్రమాదం జరిగి ప్రయాణికుడు మరణించినా లేదా శాశ్వత వైకల్యం సంభవించినా వారి కుటుంబ సభ్యులపై ఎటువంటి భారం పడకూడదని ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందు కోసం 10 లక్షల వరకు బీమా కల్పిస్తోంది. దీనిని రైల్వే శాఖ ఆపరేషనల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆఫ్ రైల్వేస్ కింద ప్రకటించారు.

ఈ ఇన్సూరెన్స్‌ సేవలని అందించడానికి రైల్వే శాఖ వేలం ప్రక్రియను కూడా నిర్వహించింది. దాదాపు 19 బీమా కంపెనీలు ఈ వేలంలో పాల్గొన్నాయి. ఇందులో శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లతో ఒప్పందం కుదిరింది. మిగిలిన కంపెనీలకి అవకాశం ఇవ్వలేదు.

ఈ ఇన్సూరెన్స్‌ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రయాణికులు టికెట్‌ తీసుకునే సమయంలో 1 రూపాయి చెల్లిస్తే ఇన్సూరెన్స్‌ వర్తిస్తుంది. ప్రయాణంలో మరణిస్తే కుటుంబానికి 10 లక్షలు, శాశ్వత వైకల్యం ఏర్పడితే రూ.10 లక్షల వరకు పరిహారం చెల్లిస్తారు. పాక్షిక వైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరితే రూ.5 లక్షల వరకు చెల్లిస్తారు. ప్రయాణికులందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వే కోరింది.

Tags:    

Similar News