Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Price Today: మహిళలకు శుభవార్త. నిన్నటి వరకు పెరిగిన బంగారం, వెండి ధరలు కాస్త ఈరోజు కాస్త తగ్గాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Price Today: బంగారం అంటే భారతీయులకు ఎంత మక్కువో ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. ఫంక్షన్ ఏదైనా సరే బంగారం కొనాల్సిందే. అంతేకాదు చేతిలో ఏమాత్రం డబ్బులు ఉన్నా బంగారం షాపులకు పరుగెడుతుంటారు. చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు బంగారమే ఆస్తి అవుతుందని కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బంగారం కొనుగోలు చేసే ముందు గతంలో ధర ఎలా ఉంది...ఇప్పుడు ఎలా ధర ఉందని గమణనిస్తుంటారు. బంగారం ధరలు పెరిగితే కొన్ని రోజులు ఆగుదామని..తగ్గుతే వెంటనే కొనాలని ప్లాన్ చేస్తుంటారు. మరి జూన్ 22 శనివారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. శుక్రవారం పది గ్రాముల బంగారం ధర రూ. 74,970 ఉండగా..శనివారం నాటికి రూ. 846 రూపాయలు తగ్గి రూ. 74,124కు చేరింది. శుక్రవారం కిలో వెండి ధర రూ. 93,400 ఉండగా శనివారం రూ. 1961 తగ్గి రూ. 91,439రూపాయలకు చేరింది.
హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర రూ.74,124గా ఉండగా..కిలో వెండి ధర రూ.91,439 పలుకుతోంది. అటు విశాఖలో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,124 ఉంటే కిలో వెండి ధర రూ.91,439గా ఉంది.ఇక విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,124గా పలుకుతుండగా.. కిలో వెండి ధర రూ.91,439గా ఉంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. శనివారం ఔన్స్ బంగారం ధర 2328గా ఉండగా.. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 29.69 డాలర్లుగా ఉంది.