అస్సాంలో భారీ వరదలు.. నీట మునిగిన 10 గ్రామాలు

అస్సాంలోని నాగావ్ జిల్లాలో గత కొద్దీ రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో భారీ వరదలు వచ్చాయి.. ఈ వరదల్లో 10 గ్రామాలకు చెందిన 10,000 మందికి పైగా ప్రజలు..

Update: 2020-09-25 10:11 GMT

అస్సాంలోని నాగావ్ జిల్లాలో గత కొద్దీ రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో భారీ వరదలు వచ్చాయి.. ఈ వరదల్లో 10 గ్రామాలకు చెందిన 10,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బోర్పాని నది , అలాగే అనేక ఇతర నదుల నీటి మట్టం ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. శుక్రవారం, బోర్పానీ నదిలో వరద జలాలు పెద్ద కట్టను కోసుకోపోయాయి, మధ్య అస్సాం జిల్లాలోని కంపూర్ రెవెన్యూ సర్కిల్ పరిధిలో 10 గ్రామాలను నీళ్లు ముంచెత్తాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కర్బీ లాంగ్పి ప్రాజెక్టు నీటి మట్టం గరిష్టస్థాయికి చేరుకుంది.. దాంతో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేయడానికి నాలుగు గేట్లను ఎత్తివేయించారు అధికారులు. వరద ప్రభావంతో మాధపారా, కచువా, లాంగ్‌జాప్, జూరిపార్, గరుబాట్ తోపాటు అనేక ప్రాంతాలలో హెక్టార్ల పంట నష్టం జరిగింది. ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించడంతో చాలా మంది గ్రామస్తులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. కాగా ఈ ఏడాది వరద ధాటికి అస్సాంలోని 30 జిల్లాలకు చెందిన 57 లక్షల మంది ప్రజలు ప్రభావితం అయ్యారు, 117 మంది ప్రాణాలు కోల్పోయారు.  

Tags:    

Similar News