Haryana: విషాదం.. శ్మశానవాటిక గోడకూలి నలుగురు మృతి

Haryana: మృతుల్లో పదకొండేళ్ల చిన్నారి ఉన్నట్లు గుర్తింపు

Update: 2024-04-21 04:45 GMT

Haryana: విషాదం.. శ్మశానవాటిక గోడకూలి నలుగురు మృతి

Haryana: హర్యానాలోని గురుగ్రామ్‌లో విషాదం జరిగింది. శ్మశానవాటిక గోడ కూలిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మృతుల్లో ఓ పదకొండేళ్ల చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. ఘటనాస్థలానికి సమీపంలోనే ఓ దుకాణం ఉంది. దానికి ఎదురుగా కుర్చీలపై కొందరు కూర్చుని ఉన్నారు. అదే సమయంలో ఇద్దరు చిన్నారులు అటుగా నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఇంతలోనే అకస్మాత్తుగా గోడ కుప్పకూలింది. అప్రమత్తమైన స్థానికులు వెంటనే శిథిలాలను తొలగించే ప్రయత్నం చేశారు. మొత్తం ఆరుగురు శిథిలాల కింద చిక్కుకోగా బయటికి తీశారు. నలుగురు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News