Union Budget 2024: పేదలకు శుభవార్త చెప్పిన నిర్మలమ్మ..మరో ఐదేండ్లపాటు ఫ్రీ రేషన్
Union Budget 2024: బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ బడ్జెట్లో రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రవేశపెట్టారు.
Union Budget 2024: ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన బడ్జెట్ సమయం రానే వచ్చింది. కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 7వ సారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టి రికార్డ్ క్రియేట్ చేశారు. మోదీ నాయకత్వంలో మూడోసారి ప్రవేశపెట్టినందుకు గర్వపడుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు ఆర్థిక ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ 3.0ను కేంద్రం ప్రవేశపెడుతుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని మరో ఐదేండ్లు పొడిగించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
పేదలకు ఉచితంగా రేషన్ అందించేందుకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో ఐదేండ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జనవరి 1 ,2024 నుంచి ఈ పథకాన్ని మరో ఐదేండ్లపాటు కొనసాగిస్తామని ప్రకటించింది. కోవిడ్ లాంటి విపత్కర సమయంలో కేంద్రం ఉపాధి, వ్రుత్తి కోల్పోయిన వారికి నెలవారి ఆహారం కోసం ఐదు కేజీల బియ్యాన్ని అందజేస్తూ వచ్చింది. ఇప్పుడు కూా ఈ స్కీంను అందజేయనున్నారు.