Delhi Air Pollution: కాలుష్య నగరంగా ఢిల్లీ.. ప్రైమరీ విద్యార్థులకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Delhi Pollution: తాజాగా హైస్కూళ్లకు సెలవులు ఇస్తూ ఉత్తర్వులు
Delhi Air Pollution: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ టాప్‌లో కొనసాగుతోంది. గతవారం నుంచి అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. రోజు రోజుకూ కాలుష్యం పెరిగిపోతూ... ప్రజల ఊపిరి తీసుకోవడానికి కూడా భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. వాయు నాణ్యత సూచీలు WHO ప్రమాణాలకు మించి 100 రెట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. సీసం, పీఎంజీ లెవెల్స్ డెంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.
నవంబర్ 11 నుంచి నవంబరు 20 వరకూ సరి-బేసి విధానం అమల్లో ఉంటుందని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఈ వారం మొత్తం విద్యా సంస్థలు టెన్త్, ప్లస్ 2 మినహా అన్ని మూసివేయాలని ఆదేశించింది. ప్రస్తుతానికి ప్రాథమిక పాఠశాలలనే మూసివేయగా... తాజాగా, హైస్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు.