Ayodhya: అయోధ్య రామమందిర్ దగ్గర తీవ్ర తొక్కిసలాట
Ayodhya: భక్తులకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు
Ayodhya: అయోధ్య రామ మందిర్ దగ్గర తీవ్ర తోపులాటు చోటు చేసుకుంది. మధ్యాహ్నం స్లాట్ దర్శనానికి భక్తులు పోటెత్తడంతో రద్దీని నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే భక్తులు ఒక్కసారిగా ఆలయానికి రావడంతో ఈ తోపులాట చోటు చేసుకుంది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరో వైపు ఉదయం నుంచి భక్తుల తాకిడి తీవ్రంగా ఉండడంతో రద్దీని నియంత్రించలేకపోతున్నారు.