ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక మలుపు.. ఛార్జిషీట్‌లో ఢిల్లీ సీఎం, వైసీపీ ఎంపీ,ఎమ్మెల్సీ కవిత పేర్లు..

Delhi liquor Scam: సెకండ్ ఛార్జిషీట్‌లో కీలక వ్యక్తుల పేర్లు

Update: 2023-02-02 10:50 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక మలుపు.. ఛార్జిషీట్‌లో ఢిల్లీ సీఎం, వైసీపీ ఎంపీ పేర్లు..

Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జిషీట్‌లో కీలక వ్యక్తుల పేర్లను చేర్చింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పేరును సెకండ్ ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. అలాగే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి పేరును కూడా ఛార్జిషీట్‌లో చేర్చింది. 

లిక్కర్ స్కామ్‌ కేసులో 65 మందిని ఈడీ ప్రశ్నించింది. 185 శాతం లాభాలు వచ్చేలా ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన చేశారని.. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.2,873కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు అధికారులు. అలాగే ఛార్జిషీట్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత పేర్లను ఈడీ ప్రస్తావించింది.

Tags:    

Similar News