Chandrachud: నీట్ పేపర్ లీకేజీ విచారణ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు
Chandrachud: మే 4న రాత్రి గుర్తుంచుకోవాలని చెప్పారంటే... అంతకంటే ముందే లీక్ జరిగి ఉండొచ్చన్న సీజేఐ
Chandrachud: నీట్ యూజీ పేపర్ లీకేజీ విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మే4న రాత్రి గుర్తుంచుకోవాలని చెప్పారంటే.. ఆ తేదీ కంటే ముందే లీక్ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు. అలా అయితే.. స్ట్రాంగ్ రూం వాలెట్‌లో ప్రశ్నపత్రం బయటకు వచ్చిందా.. అని ప్రశ్నించారు. బిహార్ పోలీసుల దర్యాప్తు రిపోర్టును ఉటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు పిటిషనర్ల పక్షాన వాదిస్తున్న న్యాయవాది నరేందర్ హుడా తన వాదనలు వినిపించారు. 161 వాంగ్మూలాలు పేపర్ లీక్ మే 4వ తేదీ కంటే ముందే చోటుచేసుకొందని బలంగా చెబుతున్నట్లు పేర్కొన్నారు. బిహార్ పోలీసుల రిపోర్టు ప్రకారం సంబంధిత బ్యాంకుల్లో ప్రశ్నపత్రాలను డిపాజిట్ చేయటానికి ముందే లీకైందని పేర్కొన్నారు.