Budget 2024: సామాన్య మధ్య తరగతి ప్రజలకు కేంద్ర గుడ్ న్యూస్..ఇక నుంచి 10వేల పెన్షన్

Budget 2024: సామాన్య, మధ్య తరగతి ప్రజలకే కేంద్రం శుభవార్త చెప్పనుంది. అటల్ పెన్షన్ యోజన స్కీముపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక నుంచి సామాన్యులకు 10వేల పెన్షన్ అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Update: 2024-07-09 23:46 GMT

Business Ideas: ఉన్న ఊరిలోనే కేవలం 5 లక్షల పెట్టుబడి పెడితే చాలు.. నెలకు రూ. 2 లక్షలు సంపాదించడం పక్కా

Budget 2024:దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు, సేవింగ్స్ చేస్తూ ఆర్థికంగా బలపడేందుకు కేంద్రం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. అందులో ముఖ్యమైన స్కీం అటర్ పెన్షన్ యోజన. వృద్ధాప్యంలో ఆర్ధికంగా బలంగా ఉండేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. ఈ స్కీంను 2015 బడ్జెట్ లో ప్రకటించింది ప్రధాని మోదీ సర్కార్. ఈ స్కీం కింద నెలకు రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 5000 వేల వరకు పెన్షన్ అందుకునేందుకు వీలు కల్పిస్తుంది. రోజువారీ వేతన జీవులు, స్వయం ఉపాధి పొందే వ్యక్తులు, చిన్న తరహావ్యాపారులకు అధికారిక పోన్షన్ స్కీమ్ లేని కొరతను తీర్చేలా ఈ పథకాన్ని రూపొందించారు.

మీ వయస్సు 18 నుంచి 40ఏండ్ల మధ్య ఉంటే..మీ రిటైర్మెంట్ 60ఏండ్ల తర్వాత ప్రతినెలా స్థిరమైన ఆదాయం వచ్చే విధంగా ఈ స్కీమ్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో మీరు పెట్టిన పెట్టుబడిని ప్రభుత్వం కచ్చితమైన హామీ ఇస్తుంది. ఈ పథకం ద్వారా వృద్ధాప్యంలో ప్రతినెలా రూ. 5వేల వరకు పెన్షన్ తీసుకోవచ్చు.

ఈనేపథ్యంలో అటల్ పెన్షన్ యోజనపై తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుతెలుస్తోంది. అటల్ పెన్షన్ యోజనకు రూ. 10వేలు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23వ తేదీన ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ స్కిం కింద పెన్షన్ పొందాలంటే కనీసం 20ఏండ్లపాటు పెట్టుబడి పెట్టాలి. ఒక వ్యక్తికి10ఏండ్ల వయస్సులో అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే..రోజుకు 7 రూపాయలు అంటే నెలకు రూ. 210 పెట్టుబడి పెట్టాలి. ఇలా 20ఏండ్లు కొనసాగిస్తే..రిటైర్మెంట్ తర్వాత నెలనెలా రూ. 5వేల పెన్షన్ వస్తుంది.

40ఏళ్ల వయస్సుకన్న వ్యక్తి అయితే నెలకు రూ. 1454 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే అతను నెలకు రూ. 5వేల పెన్షన్ తీసుకోవచ్చు. ఒక వేళ అంతకు తక్కువ పెన్షన్ అయినా సరే అనుకుంటే తక్కువ ప్రీమియం చెల్లించుకోవచ్చు. ఇప్పుడు పెన్షన్ 10వేల రూపాయాలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో చెల్లించే ప్రీమియంలో తేడాలుకూడా రావచ్చు. ఈ స్కీంలో తక్కువ వయస్సులోనే పొదుపు చేయడం ప్రారంభిస్తే ఎక్కువ లబ్ది పొందేందుకు అవకాశం ఉంటుంది. పెట్టుబడ పెట్టే దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందాలని చూస్తే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Tags:    

Similar News