Guidelines for Eye Hospitals: టెలి కన్సల్టేషన్ ద్వారా కంటి చికిత్సలు.. కేంద్రం మార్గదర్శకాలు

Guidelines for Eye Hospitals: కరోనా ఎంత సమీపంలో ఉంటే అంత తీవ్రంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. అయితే మిగిలిన వ్యాధులకు సంబంధించి రోగులను దూరం నుంచే చూసి, పరీక్షల నిర్ధారణ ద్వారా చికిత్స చేసే వీలుంటుంది

Update: 2020-08-24 06:02 GMT

Guidelines for Eye Hospitals

Guidelines for Eye Hospitals: కరోనా ఎంత సమీపంలో ఉంటే అంత తీవ్రంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. అయితే మిగిలిన వ్యాధులకు సంబంధించి రోగులను దూరం నుంచే చూసి, పరీక్షల నిర్ధారణ ద్వారా చికిత్స చేసే వీలుంటుంది. అయితే దీనికి భిన్నంగా కంటి చికిత్సకు సంబంధించి వైద్యులు, రోగులకు అతి సమీపంలో నుంచి చూస్తూ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఈ వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువ ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకుని కంటి చికిత్సలు, ఆస్పత్రుల నిర్వహణపై పలు సూచనలు చేస్తూ, కేంద్రం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.

కరోనా పాజిటివ్‌ లేదా వైరస్‌ అనుమానిత లక్షణాలున్న బాధితులకు కంటి ఆపరేషన్లు చేయరాదని కేంద్ర ఆరోగ్య, కు టుంబ సంక్షేమశాఖ తాజా గా మార్గదర్శకాలు జారీచేసిం ది. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఉండే కంటి ఆసుపత్రులు లేదా క్లినిక్‌లు తెరవకూడదని ఆదేశించింది. ఇతర ప్రాంతాల్లోని కంటి ఆసుపత్రుల్లో పాటించాల్సిన సురక్షిత పద్ధతుల ను వెల్లడించింది. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారు, గర్భిణీలు, పదేళ్లలోపు పిల్ల లు ఇంట్లోనే ఉండాలని, చిన్నచిన్న దృష్టి లోపాలకే నేత్రాలయాలకు రాకూడదని తెలిపింది. అలాగని కంటి ఆసుపత్రులకు వచ్చే బాధితులను కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని రావాలంటూ ఒత్తిడి చేయరాదని పేర్కొంది. చికిత్స అవసరమైతే మాత్రం వారి ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా తెలుసుకోవాలని సూచించింది. కరోనా పాజిటివ్‌ నిర్ధారణైన వారికి శస్త్రచికిత్స చేయకూడదని స్పష్టంచేసింది.

టెలీ కన్సల్టేషన్‌ను ప్రోత్సహించాలి

ఆసుపత్రులకు రోగుల సందర్శనలను తగ్గించడానికి టెలి–కౌన్సెలింగ్, టెలి–కన్సల్టేషన్లను ప్రోత్సహించాలని కేంద్రం స్పష్టం చేసింది. కంటి సమస్యలున్న వారి కళ్లను అత్యంత సమీపం నుంచి పరీక్షించాలి. ఆ సమయంలో బాధితులు లేదా వైద్య సిబ్బంది నుంచి శ్వాస బిందువులు ఇతరుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. పైగా కరోనా వైరస్‌ ప్రధానంగా నోరు, ముక్కు, కళ్ల నుంచే ఇతరులకు సోకుతుంది కాబట్టి కంటి వైద్యం అత్యంత జాగ్రత్తలతో చేయాలి. కంటి పరీక్ష, ఇతరత్రా టెస్టులు చేయాల్సి వస్తే తగిన జాగ్రత్తలతో రోగులను కలవవచ్చు.

కంటి ఆసుపత్రులకు ఇవీ మార్గదర్శకాలు

► కంటికి ప్రమాదం ఏర్పడుతుందని భావించిన, దృష్టిలోపం వచ్చే అవకాశం ఉందని గుర్తించిన, చికిత్స చేయకపోతే అంధకారం అవుతుందని భావించిన వాటినే అత్యవసర కేసులుగా గుర్తించాలి.

► కంటికి గాయమవడం, ఆకస్మిక దృష్టిలోపం, కంటిలో తీవ్రమైన నొప్పి, తీవ్రమైన కనురెప్పల గాయాలకు తగిన వైద్యం చేయాలి.

► అత్యవసర కేసులకే ప్రాధాన్యమివ్వాలి. ఒక రోగితో ఒక సహాయకుడినే అనుమతించాలి.

► బాధితులకు కనీసం ఆరడుగుల దూరంలో ఉండాలి. వైద్య సిబ్బంది, బాధితులు మాస్క్‌లు తప్పక వాడాలి. తరచూ చేతులు కడుక్కోవాలి. సాధ్యమైన చోట ఆల్క హాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్లను వాడాలి. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు మోచేతిని అడ్డుపెట్టుకోవాలి.

► వచ్చినవారిలో ఎవరిౖనా కరోనా అనుమానిత లక్షణాలుంటే రాష్ట్ర, జిల్లా హెల్ప్‌లైన్‌కు వెంటనే తెలపాలి. రోగులు, వారి సహాయకుల ఫోన్‌ నంబర్లు, గుర్తింపు కార్డుల వివరాలను తీసుకోవాలి.

► రోగి శ్వాస నుండి బిందువులు మీద పడకుండా నివారించడానికి శ్వాస కవచం వాడాలి.

► థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాకే ఆసుపత్రి లేదా క్లినిక్‌లోకి ప్రవేశం కల్పించాలి. రోగికి కరోనా లక్షణాలున్నాయో లేదో ఆరాతీయాలి.

► రిసెప్షన్‌లో ఎక్కువమంది గుమికూడకుండా చూడాలి.

► స్వచ్ఛమైన గాలి తీసుకునేలా ఏర్పాట్లు ఉండాలి. క్రాస్‌ వెంటిలేషన్‌ తగినంతగా ఉండాలి.

► సందర్శకులు లేదా రోగులు, ఇతర బాధితులు వదిలిపెట్టిన మాస్క్‌లను, గ్లోవ్స్‌ను బయో–మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ నిబంధనలకు అనుగుణంగా పారవేయాలి. ఆసుపత్రిని హైపోక్లోరైడ్‌తో క్రిమిసంహారకం చేయాలి.

► డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించాలి. 

Tags:    

Similar News