Delhi: ఢిల్లీ ప్రభుత్వంపై ఆరోపణలు సరికాదు- ఎయిమ్స్‌ చీఫ్‌

Delhi: ఢిల్లీ ప్రభుత్వం ఆక్సిజన్ అవసరాన్ని నాలుగింతలు చేసి చూపించిందనడం సరికాదన్నారు ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా.

Update: 2021-06-26 15:45 GMT

రణదీప్‌ గులేరియా(ఫైల్ ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Delhi: ఢిల్లీ ప్రభుత్వం ఆక్సిజన్ అవసరాన్ని నాలుగింతలు చేసి చూపించిందనడం సరికాదన్నారు ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా. ఆక్సిజన్ ఆడిట్ విషయంలో కేవలం మధ్యంతర నివేదిక మాత్రమే వచ్చిందని, తుది నివేదిక ఇంకా రాలేదని చెప్పారాయన. ఈ విషయం ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉందని, సుప్రీం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలని అన్నారు.

యాక్టివ్ కేసులు, అక్కడి ప్రాధమ్యాలు తదితర విషయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని గులేరియా అభిప్రాయపడ్డారు. కరోనా రెండో వేవ్ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం అవసరమైన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆక్సిజన్‌ను డిమాండ్ చేసిందని సుప్రీంకోర్టు ప్యానల్ తన మధ్యంతర నివేదికలో పేర్కొంది.

Tags:    

Similar News