Union Cabinet: రైతులకు మోడీ ప్రభుత్వం శుభవార్త..!
PM Kisan: రైతులకు మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
PM Kisan: రైతులకు మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 3 పంటలకు కనీస మద్దతు ధరను కేంద్రం పెంచింది. పెసర్లపై కనీస మద్దతు ధర 10.4 శాతం , వరి పంటకు కనీస మద్దతు ధర 7 శాతం, వేరుశెనగ పంటకు కనీస మద్దతు ధర 9 శాతం పెంచింది. ఖరీఫ్ పంటలకే కనీస మద్దతు ధర వర్తించనుంది. కేంద్ర కేబినెట్ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు రైతుకలు పీఎం కిసాన్ స్కీమ్ కింద వచ్చే రూ. 2 వేల డబ్బులు ఈ నెలలో 15వ తేదీన రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. పీఎం కిసాన్ 14వ విడత కింద ఈ డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి.