
Ayodhya: అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (85) ఆదివారం పక్షవాతానికి గురయ్యారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఆయనను సంజయ్ గాంధీ మెడికల్ సైన్సెస్ లో చేర్పించారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
సత్యేంద్ర దాస్ పరిస్థితి విషమంగా ఉంది. సిటీస్కాన్ లో అతనికి మెదడులో రక్తస్రావం అయ్యిందని..మెదడులోని అనేక భాగాలకు వ్యాపించిందని అయోధ్య నగరంలోని న్యూరో సెంటర్ వైద్యుడు అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు.