Ayodhya: ప్రాణప్రతిష్టకు ముందే బాలరాముడి దివ్యరూప దర్శనం

Ayodhya: రామ్‌ లలా ఆలయంలో కొనసాగుతున్న క్రతువులు

Update: 2024-01-19 11:09 GMT

Ayodhya: ప్రాణప్రతిష్టకు ముందే బాలరాముడి దివ్యరూప దర్శనం

Ayodhya: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య రామాలయంలో ఈనెల 22న ప్రతిష్ఠ చేయనున్న బాలరాముని విగ్రహం ఫొటోలు బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు విగ్రహం కళ్లపై కప్పిన వస్త్రాన్ని తొలగించారు. మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు జరుపుతున్న ఆచారాల్లో భాగంగా బాలరామున్ని గర్భగుడికి తీసుకువచ్చారు. ఐదేళ్ల బాలుడి రూపంలో దర్శనమివ్వనున్న శ్రీరాముడి విగ్రహాన్ని ఆలయ సిబ్బంది ఇప్పటికే గర్భగుడిలోని ప్రధాన వేదికపై ప్రతిష్టించారు.

వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య ప్రధాన వేదికపై ప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సరయూ నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిద పవిత్ర నదీ జలాలలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేస్తున్నారు.. ఆలయంలో ప్రత్యేక క్రతువులు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో గణేశ్‌ పూజ, వరుణ పూజ, వాస్తు పూజ శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.. జలదివస్‌లో భాగంగా రామ్‌లల్లా విగ్రహాన్ని నీటితో శుభ్రం చేశారు.

Tags:    

Similar News