Thumps Up Emoji: థంప్స్ అప్ ఎమోజి వాడుతున్నారా.. చట్టపరమైన సమస్యలు జాగ్రత్త..!

Thumps Up Emoji: మొబైల్‌లో థమ్స్ అప్ ఎమోజీ చూపించినందుకు కెనడాలో ఓ రైతుకి 50 లక్షల నష్టం జరిగింది.

Update: 2023-07-12 04:30 GMT

Thumps Up Emoji: థంప్స్ అప్ ఎమోజి వాడుతున్నారా.. చట్టపరమైన సమస్యలు జాగ్రత్త..!

Thumps Up Emoji: మొబైల్‌లో థమ్స్ అప్ ఎమోజీ చూపించినందుకు కెనడాలో ఓ రైతుకి 50 లక్షల నష్టం జరిగింది. అందుకే ఈ ఎమోజిని ఉపయోగించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చట్టపరమైన సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాస్తవానికి సోషల్ మీడియాలో తరచుగా వివిధ రకాల లైక్-డిస్‌లైక్ ఎమోజీలను ఉపయోగిస్తాము. వాటిలో ఒకటి థంప్స్ అప్ ఎమోజి. ఇందులో బొటనవేలు ముద్ర పైకి చూపి తన సమ్మతిని తెలియజేస్తాం. కానీ దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలామందికి తెలియదు.

థమ్స్ అప్ ఎమోజీని సంతకంగానే పరిగణించాలని కోర్టు తెలిపింది. కాబట్టి పబ్లిక్‌గా ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక విషయంపై థమ్స్‌ అప్ ఎమోజీని పంపినట్లయితే దానిపై మీర సంతకం చేశారని అర్థం. ఇది ఒక రకమైన ఒప్పందం అవుతుంది. కెనడాలోని సస్కట్చేవాన్‌లోని కింగ్స్ బెంచ్ కోర్టు పెండింగ్‌లో ఉన్న ఓ రెండేళ్ల కేసులో థమ్స్ అప్ ఎమోజీని ఆధారంగా చేసుకొని సంచలన తీర్పుని వెల్లడించింది.

ఒక ధాన్యం వ్యాపారి ఒక రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి మొబైల్‌లో ఒక ఒప్పంద పత్రాన్ని పంపాడు. ధర వగైరా విషయాలు ఆ ఒప్పందంలో రాసి ఉన్నాయి. తర్వాత దానిని చూసిన రైతు ఆ వ్యాపారికి థమ్స్ అప్ ఎమోజీని పంపాడు. డీల్ జరిగిందని వ్యాపారికి అర్థమైంది. అయితే కొన్ని రోజులకి ధాన్యం ధర పెరగడంతో రైతు నిరాకరించాడు. ఈ విషయమై ధాన్యం వ్యాపారి కోర్టును ఆశ్రయించగా రైతు పంపిన థమ్స్‌అప్ ఎమోజీని రుజువుగా చూపించాడు. దీంతో కోర్టు సదరు రైతుకి 50 లక్షల జరిమానా విధించింది.

ఇంతకుముందు కూడా ఇలాంటి కేసులు తెరపైకి వచ్చాయని కోర్టు తన తీర్పులో పేర్కొంది. సాంకేతిక యుగంలో థంబ్స్ అప్ ఎమోజి పత్రంపై సంతకం చేయడానికి సమానమని తెలిపింది. ఎమోజి 1990లలో ఉద్భవించింది. చాట్ చేసేటప్పుడు భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి వివిధ రకాల చిహ్నాలను రూపొందించారు. 1999లో జపనీస్ సెల్ ఫోన్ కంపెనీ NTT DoCoMo మొబైల్ ఫోన్‌లో 176 ఎమోజీల సెట్‌ను విడుదల చేసింది. దీనిని 2015లో ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలలో చేర్చారు. 'వర్డ్ ఆఫ్ ది ఇయర్'గా కూడా పేరు పెట్టారు. ప్రస్తుతం 3,000 కంటే ఎక్కువ ఎమోజీలు ఉన్నాయి.

Tags:    

Similar News