karolina goswami: పోలాండ్‌కు చెందిన మహిళా యూట్యూబర్‌కు యూట్యూబర్ ధృవ్ రాఠీ అభిమానుల వార్నింగ్
పోలాండ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ కరోలినా గోస్వామిపై మరో యూట్యూబర్ ధృవ్ రాఠీ అభిమానులు బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
పోలాండ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ కరోలినా గోస్వామిపై మరో యూట్యూబర్ ధృవ్ రాఠీ అభిమానులు బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అసలు కరోలినా గోస్వామి - ధృవ్ రాఠీ మధ్య జరుగుతున్న వివాదం గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.
కరోలినా గోస్వామి పోాలాండ్ దేశానికి చెందిన ఒక మహిళా యూట్యూబర్. ఆమె గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. కరోలినా గోస్వామి 'ఇండియా ఇన్ డిటైల్స్' పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతోంది. అయితే మరో ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ అభిమానులు ఆమెపై దాడి చేస్తామని బెదిరించారని ఇటీవల ఆమె తన చానెల్‌లో పేర్కొన్నారు. ఇది మాత్రమే కాదు, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో కూడా షేర్ చేసింది, అందులో ఆమె సెక్యూరిటీ గార్డుల మధ్య నడుస్తుండటం చూడవచ్చు.
వాస్తవానికి, గత మే నెలలో కరోలినా గోస్వామికి యూట్యూబర్ ధృవ్ రాఠి అభిమానుల నుండి 220 కంటే ఎక్కువ సార్లు బెదిరింపు కాల్స్ వెళ్లాయి. కరోలినా గోస్వామి తన యూట్యూబ్ ఛానెల్ 'ఇండియా ఇన్ డిటైల్స్'లో ధ్రువ్ రాఠీ చేసిన యూట్యూబ్ వీడియోలను విశ్లేషించిన సమయంలో ఆమెకు ఈ బెదిరింపులు వచ్చాయి.
గత సంవత్సరం జర్మనీలో ధృవరాఠీ అభిమానులు తనపై దాడి చేశారని గోస్వామి, ఆమె భర్త అనురాగ్ గోస్వామి పేర్కొన్నారు. 2023లో జరిగిన ఈ దాడిలో తన కారు ధ్వంసం అయ్యిందన్నారు. అంతేకాదు తమకు సంబంధించిన పలు ఎలక్ట్రానిక్ పరికరాలను లాక్కున్నారని పేర్కొన్నారు. కరోలినా ఆమె భర్త గతంలో ధృవ్ రాఠిపై అనేక వీడియోలు చేశారు.
కరోలినా గోస్వామి ఎవరు?
కరోలినా గోస్వామి పోలాండ్ పౌరురాలు. ఆమె ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డ్ హోల్డర్ కావడం విశేషం. కరోలినా తన భర్త అనురాగ్, పిల్లలతో భారతలో నివసిస్తోంది. వీరికి 'ఇండియా ఇన్ డిటైల్స్' అనే యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. వీరి ఛానెల్‌లో 1.1 మిలియన్ కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానెల్‌ని కరోలినా ఆమె భర్త ఇద్దరూ కలిసి నడుపుతున్నారు.
ఇదిలా ఉంటే గడిచిన కొంతకాలంగా సోషల్ మీడియా ప్రభావం భారత రాజకీయాలపై పెద్ద ఎత్తున కనిపిస్తోంది. వీటిలో పలువురు యూట్యూబర్లు ఆయా రాజకీయ పార్టీలకు వత్తాసు పలుకుతూ వీడియోలను రిలీజ్ చేయడం అనేది పరిపాటిగా మారింది. తద్వారా ఓటర్లను ప్రభావితం చేయడమే వీరి లక్ష్యంగా కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వీడియోలపై గతంలో ఎలక్షన్ కమిషన్‌కు సైతం పలు ఫిర్యాదులు అందాయి.