Maharashtra: మహారాష్ట్రలో మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్

Maharashtra: నిన్న ఒక్కరోజే 6వేలకు పైగా పాజిటివ్ కేసులు * ఈ నెలలో ఆరుగురు మంత్రులకు కరోనా

Update: 2021-02-20 03:09 GMT

Representational Image

Maharashtra: మహారాష్ట్రలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. ఒక వైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పటికీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 6వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది అమరావతి, అకోలా జిల్లాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్స్ కలకలం రేపుతున్నాయి. జన్యుపరంగా మారిన ఈ కొత్త రకం వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.

అమరావతిలో 700 మందికి కరోనా పాజిటివ్ వస్తే అందులో 350 మందికి స్ట్రెయిన్ సోకినట్టు అధికారులు గుర్తించారు. నాగపూర్ నుంచి ఔరంగాబాద్ వరకు ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల నిర్లక్ష్యం వల్ల కూడా కేసులు పెరిగిపోతున్నాయన్నారు. భౌతికదూరం, మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. కోవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించారు. మాస్కులు లేని వారికి ఫైన్ విధిస్తున్నారు.

మరోవైపు కేరళ, కర్ణాటకలో కొత్త కేసులు భయపెడుతున్నాయి. తమిళనాడులోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రా్లో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. అంటే దేశంలో సెకెండ్ వేవ్ మొదలైందా? సెకండ్ వేవ్‌తో పాటు కొత్త స్ట్రెయిన్ కూడా వస్తే పరిస్థితి ఏంటనీ వైద్యాధికారులు ఆలోచిస్తున్నారు. అయితే ఉత్తర భారతంలో కేసులు పెరుగుతుండడంతో ఇతర రాష్ట్రాలకు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. దక్షిణాది రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. 

Tags:    

Similar News