RRR వివాదంపై జక్కన్న ఎందుకు స్పందించలేదు?

మిస్టర్ పర్ఫెక్ట్ జక్కన్న వివాదాల పాలయ్యాడు. గల్లీలో యువకుడి నుంచి తెలంగాణ మంత్రుల వరకు అందరూ జక్కన్నపై మండి పడుతున్నారు.

Update: 2020-11-05 10:23 GMT

RRR Movie Controversy Updates : మిస్టర్ పర్ఫెక్ట్ జక్కన్న వివాదాల పాలయ్యాడు. గల్లీలో యువకుడి నుంచి తెలంగాణ మంత్రుల వరకు అందరూ జక్కన్నపై మండి పడుతున్నారు. మరి జక్కన్న వారికి సమాధానం ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? సమాధానం ఇస్తారా? లేదా సినిమా రిలీజ్ వరకు ఆగుతారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ స్టోరీ లో.....

బాహుబలి మూవీతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకుపోయిన దర్శకధీరుడు రాజమౌళి.. సినిమా విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో..ప్రతీ సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తుంటాడు. అందరిచేత జక్కన్నగా పిలువబడే రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టార్టర్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాపై వివాదం చోటు చేసుకుంది.

ఇటీవల కొమురం భీం జయంతి సందర్భంగా ఆర్ఆర్ఆర్ లో టీజర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో కొమురంభీమ్ గా ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తారక్ ను ఓ మత విశ్వాసాలకు సంబంధించిన టోపీ ధరించినట్లు చూపించడంపై అభ్యంతరాలు వచ్చాయి. ఆదివాసీల నుంచి ఎంపీల వరకు అందరూ రాజమౌళికి వార్నింగ్ ఇస్తూ వస్తున్నారు... కొమురం భీం కు టోపీ ధరించి ఉన్న సన్నివేశాలను తొలగించకుండా సినిమా రిలీజ్ చేస్తే థియటర్స్ తగుల బెడుతామంటూ హెచ్చరిస్తున్నారు.

ఇంత వివాదం జరుగుతున్నా రాజమౌళి కానీ.. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం కానీ స్పందించడం లేదు. మొదటి నుంచి ఇది ఇద్దరు రియల్ లైఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ క్యారెక్టర్స్ తో తీస్తున్న కల్పిత కథగా రాజమౌళి చెబుతూ వచ్చారు. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తయ్యింది. సినిమాలో ఎన్టీఆర్ టోపీని తీసేయడం..సున్నితమైన అంశం కావడంతో ఇండస్ట్రీ ప్రముఖలు, పలువురు రాజకీయ నాయకులతో ఈ వివాదంపై చర్చిస్తున్నారని టాక్. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో అనే విషయంపై పూర్తిగా డిస్కషన్ చేసిన తర్వాతే జక్కన్న స్పందించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

Tags:    

Similar News