Naga Chaitanya: నాగచైతన్య-శోభిత విడాకులు..బయటకు వచ్చిన అగ్రిమెంట్..అసలు విషయం తెలిస్తే షాక్

Update: 2024-12-14 03:34 GMT

 Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహం ఈనెల 4వ తేదీన ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. నిరాడంబరంగా జరిగిన ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అక్కినేని ఫ్యామిలీతో పాటు దగ్గు బాటి ఫ్యామిలీ కూడా వీరి పెళ్లిలో సందడి చేశారు. రెండు రోజుల క్రితం ముంబై వివాహ రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించారు. అయితే నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో బిజీగా ఉన్నారు. అయితే వీరిద్దరి వివాహం గురించి ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

వీరిద్దరి వివాహం ఓ అగ్రిమెంట్ ప్రకారం జరిగిందని..తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరి వివాహ సమయంలో నాగార్జున వీరితో ఓ అగ్రిమెంట్ రాయించుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా శోభితతో ఈ అగ్రిమెంట్ పై సంతకాలు చేయించుకున్నారని సమాచారం. భవిష్యత్తులో ఏవైనా కారణాలతో వీరిద్దరూ విడిపోవాల్సి వస్తే ఆస్తిలో సగం వాట తనకు భరణం కింద ఇవ్వడం కుదరదని నాగార్జున ముందుగానే ఈ అగ్రిమెంట్ చేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి.

వీరిద్దరూ సంతోషంగా ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాము కానీ ఏవైనా కారణాలతో విడిపోవాల్సి వస్తే నాగేశ్వరరావు సంపాదించిన ఆస్తి, తాను సంపాదించిన ఆస్తిలో ఏమాత్రం వాటా ఇవ్వడం కుదరదని నాగచైతన్య సంపాదించిన ఆస్తిలో మాత్రమే భరణం కింద ఎంత చెల్లించాల్సి ఉంటుందో అది మాత్రమే తనకు చెందుతుందని ఓ అగ్రిమెంట్ చేయించి సంతాలు కాలు తీసుకున్నారని తెలుస్తుంది.

ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కొంతమంది నాగార్జున చేసిన పనిని సమర్థిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు విడిపోవడం ఆస్తులు రాయించుకోవడం చూస్తుంటే నాగార్జున చేసింది మంచిదే అని పిస్తుంది. నాగచైతన్య, సమంత విడిపోయిన విషయం తెలిసిందే. భరణం కింద కోట్లాది రూపాయలు తీసుకుందని టాక్. అందుకే మందుస్తు జాగ్రత్తగా నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News