Allu Arjun Arrested: అల్లు అర్జున్ అరెస్ట్
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం అర్జున్ (Allu Arjun) ఇంటికి చిక్కడపల్లి , టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పారు.ఆ సమయంలో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహరెడ్డి, అల్లు అరవింద్ కూడా అక్కడే ఉన్నారు. అల్లు అర్జున్ ను పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించారు. ఆమె కొడుకు గాయపడ్డారు. ఈ ఘటనపై బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బిఎన్ఎస్ చట్టంలోని 105, 118 (1), రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో తనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును క్వాష్ చేయాలని అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో డిసెంబర్ 12న పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ విచారణకు రాలేదు. డిసెంబర్ 13న ఈ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉంది.సంధ్య థియేటర్ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఈ కేసులో ఏ3 గా అల్లు అర్జున్ ను పోలీసులు చేర్చారు.
పోలీస్ స్టేషన్ కు చేరుకున్న అల్లు శిరీష్
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా ఉన్నారు. పోలీస్ వాహనంలో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తమ వాహనంలో శిరీష్, అరవింద్ లు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు విచారించనున్నారు. మరో వైపు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిని కూడా వచ్చారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.
పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం
తమ ఇంటికి వచ్చిన పోలీసులపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా సమాచారం ఇవ్వకుండా తన ఇంటికి వచ్చిన పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు. అయితే నాన్ బెయిలబుల్ కేసుపై ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని పోలీసులు అల్లు అర్జున్ కు చెప్పారు. కనీసం తన డ్రెస్ మార్చుకొనేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. దీనికి పోలీసులు అంగీకరించారు.