Sneha Reddy, Allu Arjun: అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి ఎన్ని వేల కోట్ల ఆస్తులున్నాయో తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే
Sneha Reddy Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో ఆయన భార్య స్నేహారెడ్డి (Sneha Reddy )కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె ఆస్తుల వివరాలు హాట్ టాపిగ్గా మారాయి. అల్లు స్నేహారెడ్డికి ఎన్నివేల కోట్ల ఆస్తులున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయమంటున్నారు.
పుష్ప2 మూవీ విడుదల తర్వాత అల్లు అర్జున్ నిత్య వార్తల్లో నిలుస్తున్నారు. పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేస్తుంటే..అల్లు అర్జున్ (Allu అర్జున్) మాత్రం పలు గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్నారు. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించింది. ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వ్యవహారం అల్లు అర్జున్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. శుక్రవారం ఉదయం అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది.
అయితే ఇప్పుడు ఆయన భార్య స్నేహా రెడ్డి గురించి పలు ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో ఆయన భార్య పక్కనే ఉన్నారు. భార్యను ఓదార్చి బన్నీ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే స్నేహారెడ్డి గురించి చర్చ జోరుగా జరుగుతోంది.
అల్లు అర్జున్ స్నేహారెడ్డిదిల ప్రేమ వివాహం. 2011 మార్చి 6వ తేదీన వీరిద్దరి వివాహం జరిగింది. కొన్నేళ్లపాటు వీరిద్దరు ప్రేమించుకున్న తర్వాత 2010లో ఎంగేజ్ మెంట్ జరిగింది. తర్వాత ఏడాది వివాహం జరిగింది. అయితే స్నేహరెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఏపీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు, వ్యాపారవేత్త కూడా. అతను సైంట్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ కూడా. స్నేహ కూడా 42కోట్ల నికర విలువతో మంచి వ్యాపారవేత్త. అంతేకాదు సోషల్ మీడియా స్టార్ కూడా. బన్నీ భార్య అయినప్పటికీ స్నేహ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు స్నేహారెడ్డి తన తండ్రి వ్యాపారాన్ని చూసుకోవడంలో బిజీగా ఉంది.