Allu Arjun: అల్లు అర్జున్ కు బెయిల్ రావడంపై సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది?

Allu Arjun: అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 13న బెయిల్ మంజూరు చేసింది.

Update: 2024-12-14 04:10 GMT

Allu Arjun: అల్లు అర్జున్ కు బెయిల్ రావడంపై సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది?

Allu Arjun: అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 13న బెయిల్ మంజూరు చేసింది. వెంటనే ఆయనను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే టెక్నికల్ అంశాలను సాకుగా జైల్లో ఉంచారని అల్లు అర్జున్ న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఆదేశించిన అల్లు అర్జున్ ను విడుదల చేయకపోవడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తెస్తామంటున్నారు.

మరో వైపు అల్లు అర్జున్ బెయిల్ విషయమై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం సాగుతోంది. ఎవరికి తోచినట్టుగా వారు పోస్టులు పెడుతున్నారు. నిరాధారమైన ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది.

అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి ఆయన సతీమణి సురేఖ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కుటుంబానికి మధ్య గ్యాప్ ఉందని ప్రచారం సాగుతోంది. కానీ, చిరంజీవితో పాటు నాగబాబు కూడ అల్లు అర్జున్ ను ఇంటికి వెళ్లారు. ఈ రెండు కుటుంబాలకు గ్యాప్ లేదని వీరిద్దరూ అల్లు అర్జున్ ఇంటికి రావడంతో తేలిపోయిందనే చర్చ కూడా సోషల్ మీడియాలో తెరమీదికి వచ్చింది.

Tags:    

Similar News