CM Pellam: రాజకీయ నేపథ్యంలో సాగే 'సీఎం పెళ్లాం'.. విడుదలైన టీజర్‌..

CM Pellam: జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సీఎం పెళ్లాం.

Update: 2024-09-16 06:30 GMT

 CM Pellam: రాజకీయ నేపథ్యంలో సాగే 'సీఎం పెళ్లాం'.. విడుదలైన టీజర్‌.. 

CM Pellam: జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సీఎం పెళ్లాం. ఆర్.కే సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గడ్డం వెంకట రమణరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్‌ సినిమా ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సోమవారం టీజర్‌ను విడుదల చేసింది.

హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పెళ్లాం మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమా ద్వారా మంచి సందేశాన్ని అందిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. కామెడీతో పాటు సమకాలీన అంశాలను ఇందులో ప్రస్తావించనున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ.. 'ఒకే ఒక్కడు సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి కావడం చూశాం. మా మూవీలో సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేసేందుకు ముందుకొస్తే ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాం' అని చెప్పుకొచ్చారు.

ఇక సీనియర్‌ హీరో సుమన్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. రొటీన్ కు భిన్నమైన పాత్రలో కనిపిస్తానని తెలిపారు. చాలా మంది కథతో వస్తున్న ఈ సినిమా ప్రతీ ఒక్కరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు. ఇంద్రజ గతంలో తనతో నటించిదని ఇప్పుడు మళ్లీ ఆమెతో నటించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇంద్రజ కూడా.. సుమన్‌తో ఎన్నో సినిమాలు చేశానని, ఆయన మంచి మనసు అప్పుడు ఇప్పుడూ ఒకేలా ఉందన్నారు. ఆయన అప్పటికే స్టార్ హీరో అయినా కొత్త హీరోయిన్ గా వచ్చిన తనతో ఎంతో గౌరవంగా మాట్లాడేవారని గతాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు అలీ మాట్లాడుతూ.. దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి దర్శకత్వం మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చాడని, 20 ఏళ్ల కిందట ప్రకాష్ రాజ్ గారితో ఓ సినిమా రూపొందించాడని తెలిపారు. ఆ తర్వాత యూఎస్ఏ వెళ్లిపోయిన ఆయన అక్కడ బాగా స్థిరపడ్.. సినిమా మీద ప్యాషన్‌తో మళ్లీ సీఎం పెళ్లాం అనే మంచి మూవీ రూపొందించాడు. ఈ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకురావాలని అలీ కోరుకున్నారు. 

Tags:    

Similar News