Chinmayi: జానీ మాస్టర్‌ వ్యవహారంపై స్పందించిన చిన్మయి.. షాకింగ్ కామెంట్స్‌..

Chinmayi: ప్రస్తుతం ఇండస్ట్రీలో జానీ మాస్టర్‌ వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోన్న విషయం తెలిసిందే. ప్రముఖ డ్యాన్సర్‌ జానీపై ఓ యువతి ఆరోపణలు చేసింది.

Update: 2024-09-17 10:45 GMT

Chinmayi: జానీ మాస్టర్‌ వ్యవహారంపై స్పందించిన చిన్మయి.. షాకింగ్ కామెంట్స్‌..

Chinmayi: ప్రస్తుతం ఇండస్ట్రీలో జానీ మాస్టర్‌ వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోన్న విషయం తెలిసిందే. ప్రముఖ డ్యాన్సర్‌ జానీపై ఓ యువతి ఆరోపణలు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతిని (అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌) జానీ మాస్టర్‌ లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. నార్సింగ్‌ పోలీస్టేషన్‌లో కేసు కూడా నమోదు అయిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే జానీ మాస్టర్‌ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే లైంగింక వేధింపుల ఆరోపణలు రాగానే జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ ఆదేశించింది. పోలీసు కేసు నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలిపింది. ఇక ఈ వ్యవహారంపై పలువురు సినీ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ గాయని చిన్మయి సైతం స్పందించారు. ఒక మీడియా కథనాన్ని ట్యాగ్‌ చేసిన చిన్మయి.. 'నివేదికల ప్రకారం ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్‌ వేధించడం ప్రారంభించాడు. ఈ కేసులో పోరాడేందుకు కావాల్సినంత శక్తి ఆ అమ్మాయికి చేకూరాలని నేను కోరుకుంటున్నాను.' అంటూ ఆమె చెప్పుకొచ్చారు. మరి జానీ మాస్టర్ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. 

Tags:    

Similar News