P Susheela: ప్రముఖ గాయని పి.సుశీలకు అస్వస్థత.. చెన్నైలో చికిత్స

P Susheela: ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందంటున్న వైద్యులు

Update: 2024-08-18 04:23 GMT

P Susheela: ప్రముఖ గాయని పి.సుశీలకు అస్వస్థత.. చెన్నైలో చికిత్స

P Susheela: ప్రముఖ నేపథ్య గాయని అస్వస్థతకు గురయ్యారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి.సుశీల అనారోగ్యానికి గురయ్యారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా పి.సుశీల గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 86 ఏళ్ల సుశీల కడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరినట్టు తెలుస్తోంది.పి.సుశీల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారామె. ఆమె త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమ వర్గాలతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News