టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రంగా 'మహర్షి' సినిమా ఎల్లుండి అనగా మే 9న విడుదలకు సిద్ధమవుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా, అల్లరి నరేష్ ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగులోనే కాకా తమిళంలో కూడా విడుదల కావాల్సింది కానీ ఇప్పుడు ఈ చిత్ర తమిళ విడుదలకు చిక్కులు వచ్చి పడ్డాయి. ప్రముఖ థియేటర్ చైన్ వెట్రి సినిమా 'మహర్షి' ని విడుదల చేయాలి. కానీ బయ్యర్ తో షేరింగ్ పెర్సెన్టేజ్ గురించి డీల్ కుదరకపోవడంతో విడుదల చెయ్యమని చెబుతున్నారట.
ఇదే బాటలో మరో సంస్థ జికే సినిమాస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రేపటికల్లా ఈ సమస్య పరిష్కారం అయితే ఓకే కానీ అవ్వకపోతే వెట్రి ధియేటర్ చైన్ లో ఉన్న థియేటర్ లలో మహర్షి రాకపోవచ్చు. దీన్ని పరిష్కరించేందుకు బయ్యర్ల తరఫున కొందరు చర్చలు సాగిస్తున్నారట. ప్రస్తుతానికి అడ్వాన్సు బుకింగ్ కూడా ఇంకా మొదలు పెట్టలేదు. ఇదే జరిగితే వసూళ్ళ మీద ప్రభావం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ కు తమిళనాడులో మార్కెట్ పెరగటానికి ఇదే మంచి అవకాశం. కానీ ఈ అడ్డంకి వచ్చిపడింది. చూద్దాం ఏమవుతుందో.