Actor Chandu: త్రినయని సీరియల్‌ నటుడు చందు ఆత్మహత్య

Actor Chandu: రాధమ్మపెళ్లి, కార్తీక దీపం సీరియల్స్‌లో నటిస్తున్న చందు

Update: 2024-05-18 02:47 GMT

Actor Chandu: త్రినయని సీరియల్‌ నటుడు చందు ఆత్మహత్య

Actor Chandu: బుల్లితెర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలోని తన నివాసంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. త్రినయని, కార్తీక దీపం, రాధమ్మ కూతురు వంటి సీరియల్స్ లో చందు నటించి ప్రేక్షకులను మెప్పించాడు. చందుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ, కుటుంబ సమస్యల కారణంగా వారికి దూరంగా ఉంటున్నారు. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పవిత్రతో చందుకు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్నారు. చందు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతుడి తండ్రి చెన్న వెంకటేశ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News