SSMB28: త్రివిక్రమ్ టైటిల్స్ గేమ్ వెనక దాగిన రహస్యం ఇదే..
* అల వైకుంఠపురం సినిమా సమయంలో త్రివిక్రమ్ ఎలాగైతే టైటిల్ గేమ్ ఆడారో అదే స్ట్రాటజీతో SSMB28 విషయంలోనూ గేమ్ స్టార్ట్ చేశారని టాలీవుడ్ లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
SSMB28: అల వైకుంఠపురం సినిమా సమయంలో త్రివిక్రమ్ ఎలాగైతే టైటిల్ గేమ్ ఆడారో అదే స్ట్రాటజీతో SSMB28 విషయంలోనూ గేమ్ స్టార్ట్ చేశారని టాలీవుడ్ లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అలవైకుంఠపురం రిలీజ్ సమయంలో త్రివిక్రమ్ ఎలాంటి మైండ్ గేమ్ ఆడారు.. SSMB28 విషయంలో మాటలమాంత్రికుడు చేస్తున్న గారడి ఏంటంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత సెట్స్ మీద వెళ్లేందుకు ఎంతో టైమ్ తీసుకోవడంతో ఎన్నో రూమర్లు చెలరేగాయి. వాటన్నింటికి చెక్ పెడుతూ ఇటీవలే సెట్స్ మీదకి వెళ్లింది. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో జోష్ వచ్చింది. అయితే ఆ జోష్ ఎక్కువ కాలం నిలవకుండానే ఆవిరైపోయింది. ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా షూటింగ్ ఆగిపోయింది.
SSMB28 పై మళ్లీ పుకార్లు షికార్లు చేస్తున్న వేళ నిర్మాతల నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. మూవీ షూటింగ్ ని త్వరలోనే ప్రారంభిస్తున్నామని అంతేకాక, టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా నట శేఖర్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని మే31న రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో అమరావతికి అటు ఇటు, గుంటూరు కారం, ఊరికి మొనగాడు ఇలా మూడు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఈ మూడు టైటిల్స్ లో ఒకటి ఖరారు చేస్తారని, ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేస్తారని అంటున్నారు.
గతంలో అలవైకుంఠపురం సినిమా సమయంలో కూడా టైటిల్ విషయంలో ఇలాగే తెగ ప్రచారం జరిగింది. చివరికి ప్రచారంలో ఉన్న టైటిల్స్ ని కాకుండా త్రివిక్రమ్ వేరే టైటిల్ ని ఫిక్స్ చేశాడు. టైటిల్స్ విషయంలో గందరగోళం పక్కనపెడితే... ఇలా ప్రచారం వల్ల సినిమా షూటింగ్ దశలో ఉండగానే కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. SSMB28 విషయంలో కూడా త్రివిక్రమ్ సేమ్ ఫార్ములాని అప్లై చేశారని టాక్ ఫిలిమ్ నగర్ లో జోరుగా వినిపిస్తోంది.
SSMB28 స్టార్టై వెంటనే ఆగిపోవడంతో ఎన్నో రూమర్స్ వచ్చాయి. నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చినా గాసిప్స్ కి బ్రేక్ పడలేదు. దీంతో ఫస్ట్ లుక్ రిలీజ్ సమయానికి సినిమా పై హైప్ జనరేట్ చేసేందుకు త్రివిక్రమ్ టైటిల్స్ గేమ్ స్టార్ట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ, SSMB28లో మహేష్ బాబు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో పాటు, డైలాగ్ మాడ్యులేషన్ ఉంటుందని తెలియడంతో ఘట్టమనేని ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్ లో మహేష్ బాబు మాస్ లుక్ లో దర్శనం ఇవ్వడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి, త్రివిక్రమ్ ఆ అంచనాలను ఏమేరకు నిలబెడతారో చూడాలి.