OG: పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమా గురించి షాకింగ్ అప్డేట్...
OG: పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమా గురించి షాకింగ్ అప్డేట్...
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు "సాహో" ఫేమ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో ఒక సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఈ సినిమాని హైదరాబాద్లో ఒక పూజా కార్యక్రమం ద్వారా అధికారికంగా లాంచ్ చేశారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. "సాహో" స్థాయిలో ఒక భారీ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి "ఓ జి" అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు.
అయితే సినిమా టైటిల్ మరియు పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమాని దర్శక నిర్మాతలు రెండు భాగాలుగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి, కేజిఎఫ్, పుష్ప వంటి సినిమాల లాగా ఈ సినిమా కథని కూడా రెండు భాగాలుగా విభజించారట. అయితే అందులో మొదటి భాగం లో అదిరిపోయే క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుందని తెలుస్తోంది.
ఇక సినిమా మొత్తం మీద క్లైమాక్స్ సీన్ హై లైట్ గా నిలుస్తుంది అని రెండవ భాగంపై మరింత అంచనాలను కూడా పెంచుతుంది అని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని సుజిత్ ప్లాన్ చేస్తున్నారు. పైగా సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ కి డై హార్డ్ ఫ్యాన్ కాబట్టి పవన్ కళ్యాణ్ ని ఎలా చూపిస్తే బాగుంటుందో సుజిత్ కి బాగా తెలుసని కాబట్టి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు కూడా చెబుతున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అరవింద్ కూడా సీక్రెట్ ఇన్వెస్టర్ గా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.