కుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
Pawan Kalyan-Renu Desai: పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన "బద్రి" సినిమా సెట్స్ లో కలిసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు.
Pawan Kalyan-Renu Desai: పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన "బద్రి" సినిమా సెట్స్ లో కలిసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న కొన్నేళ్ల తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతో వీరు భార్యాభర్తలుగా విడిపోయి దూరంగా ఉంటున్నారు. అయినా సరే పిల్లల కోసం ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉంటారు. మెగా కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా అకీరా నందన్ మరియు ఆద్య కూడా వచ్చి వెళుతూ ఉంటారు. మరోవైపు మెగా అభిమానులు అందరూ అకీరానందన్ ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెడతాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మరియు రేణుదేశాయ్ కలిసి ఎప్పుడైనా ఒక వేదికపై కనిపిస్తారా అని అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా అకీరానందన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. అకీరానందన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ మరియు రేణుదేశాయ్ ఈ గ్రాండ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరియు రేణుదేశాయ్ పిల్లలతో కలిసి ఒక ఫోటో దిగారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా కాలం తర్వాత మళ్లీ రేణుదేశాయ్ మరియు పవన్ కళ్యాణ్ ని ఒక ఫోటో లో చూసి అభిమానులు సంతోషించారు.