మహర్షి' బడ్జెట్ పై రియాక్ట్ అయిన మహేష్

Update: 2019-05-05 09:00 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా 'మహర్షి' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి నాకు కొన్ని ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మహేష్ బాబు ఇమేజ్ కి సూట్ అయ్యేలా ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోందని ఈ చిత్రాన్ని నిర్మించటానికి నిర్మాతలు ఏకంగా 110-120 కోట్ల వరకు వెచ్చించారని పుకార్లు బయటికి వచ్చాయి. తాజాగా మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు.

నిర్మాతలు కథను నమ్మి ఈ గుడ్డిగా వెళ్ళినప్పుడు బడ్జెట్ పెరగడం తో బడ్జెట్ పెరగడం తప్పలేదని మహేష్ బాబు అన్నారు. "కథ ప్రకారం న్యూయార్క్ లో సీఈఓ లాగా కనబడాలి. అక్కడ హెలీకాఫ్టర్లు, ఖరీదైన కార్లు వగైరా అక్కడ రేంజ్ లోనే కనబడాలి. అలాగే పల్లెటూరి సెట్ వేసి అందులో వేలాది మంది ప్రజల్ని చూపించడం కోసం ప్రతి రోజూ వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు అవసరమయ్యేవారు. అక్కడ సాయంత్రం ఐదు గంటలకే లైట్ పడిపోతుంది. అందుకే 10 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది. దాని వల్ల బడ్జెట్ కూడా బాగా పెరిగింది. ఇలాంటి రకరకాల కారణాలు ఉంటాయి. కథను నమ్మి తీసే నిర్మాతలు దక్కడం నా అదృష్టం" అని అన్నారు మహేష్ బాబు.

Similar News