Allu Arjun: సైలెంట్ ప్లానింగ్ తో ఐకాన్ స్టార్ దూకుడు
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైలెంట్ కిల్లర్ అంటున్నారు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైలెంట్ కిల్లర్ అంటున్నారు. కేవలం పుష్ప 2 కే పరిమితమయ్యాడని అనుకునేలోపు ప్లానింగ్ తో ఊపేస్తున్నాడు. డిసెంబర్ లో త్రివిక్రమ్ మూవీ, సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగ సినిమా లాంచ్ అంటున్నారు.. అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. మరి ప్రభాస్ తో సందీప్ చేసే స్పిరిట్ పరిస్థితేంటి?
పుష్ప 2 అక్టోబర్ లోగా పూర్తి చేసేలా వేగం పెంచిన బన్నీ, ఆతర్వాత ఒకేసారి రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించబోతున్నాడట. అందుకే త్రివిక్రమ్ మీద ప్రెజర్ పెంచేందుకే గుంటూరు కారం మూవీతో మాటల మాంత్రికుడు బిజీ అయిన టైంలో కూడా, ఇలా ఎనౌన్స్ చేశాడట. నిజానికి బన్నీ పుష్ప తో హిట్ వచ్చిందని, పుష్ప 2 కోసం ఆల్ మోస్ట్ రెండేళ్లు టైం స్పెండ్ చేశాడు. మరో 3 నెలల్లో షూటింగ్ పూర్తవబోతోంది. అంతవరకు ఓకే, కాని సీక్వెల్ కోసం ఏళ్ల కేళ్లు స్పెండ్ చేస్తే, కాలం కరిగిస్తే, తర్వాత ప్రాజెక్ట్ ప్లానింగ్ ఎలా? ఆ ప్రశ్నకే సమాధానాలు రెడీ చేసుకున్నాడు బన్నీ.
పుష్ప 2 అయిపోగానే డిసెంబర్ లో త్రివిక్రమ్ మేకింగ్ లో సినిమాను లాంచ్ చేయాలనుకుంటున్నాడట బన్నీ. అందుకే మాటల మాంత్రికుడి మీద ప్రెజర్ పెంచేందుకే ఆ ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేయించాడంటున్నారు. ఆ తర్వాతే సందీప్ వంగ మేకింగ్ లో మూవీ పట్టాలెక్కబోతోంది. ప్రజెంట్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ తో స్పిరిట్ మూవీ తీస్తున్నాడు. ఆగస్ట్ 11న రానున్న ఈ సినిమా తర్వాత దసరాకు ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేసుకున్నాడు సందీప్ .. కాని ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి.
సలార్ మూవీ షూటింగ్ ఎండింగ్ లో ఉంది. దీంతో ప్రభాస్ ఫ్రీ అయ్యేలా ఉన్నాడు. ప్రాజెక్ట్ కే కూడా 80 శాతం పూర్తైంది. దీంతో ఇక సందీప్ రెడ్డి స్పిరిట్ పట్టాలెక్కుతుందన్నారు. కాని అది సమ్మర్ కి వాయిదా పడుతోందట. సంక్రాంతికి బన్నీతో సందీప్ రెడ్డి వంగా మూవీ మొదలై, సమ్మర్ లోగా సగం పూర్తవుతుందట. ఆప్పడు స్పిరిట్ ని లాంచ్ చేసి, రెండు సినిమాలను సందీప్ ప్యార్ లల్ గా తెరకెక్కిస్తాడట.
మొత్తానికి పుష్ప 2 వల్ల వచ్చిన గ్యాప్ ని ఫిల్ చేసేందుకు ఒకేసారి రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కించే ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. ఇక త్రివిక్రమ్ తో ప్లాన్ చేస్తున్న మూవీ ఫ్యామిలీ డ్రామాగానే కాదు, రెండు భాగాలుగా ప్లాన్ చేస్తోందట. సో అలా ముచ్చటగా మూడు ప్రాజెక్టులతో సైలెంట్ గా బన్నీ చేయాల్సిన ప్లానింగ్ చేసుకుంటూ పోతున్నాడు.