Tirupati Laddu Controversy: కార్తీ 'తిరుపతి లడ్డూ' వ్యాఖ్యలపై పవన్ ఫైర్.. యంగ్ హీరో రియాక్షన్ ఏంటంటే?
Tirupati Laddu Controversy: తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
Tirupati Laddu Controversy: తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో కార్తీ చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
వివరాల్లోకి వెళితే.. హీరో కార్తీ తాజాగా నటిస్తున్న చిత్రం సత్యం సుందరం. ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన కార్తీక్‌కు యాంకర్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. 'ఇంకో లడ్డూ కావాల నాయనా' అంటూ యాంకర్ ప్రశ్నించగా.. కార్తీ కాస్త ఫన్నీగా బదులిచ్చే ప్రయత్నం చేశారు.
కార్తీ మాట్లాడుతూ.. 'ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. ఆ టాపిక్ చాలా సెన్సిటివ్. మనకు వద్దు' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అయితే తాజాగా ఇదే విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్తీ మాటలపై సీరియస్ అయ్యారు. ‘కొందరు లడ్డూ మీద జోకులు వేస్తున్నారు. నిన్న ఒక సినిమా ఫంక్షన్ చూశాను. లడ్డూ టాపిక్ చాలా సెన్సిటివ్ అని అన్నారు. లడ్డూ టాపిక్ సెన్సిటివ్ కాదు.. దయచేసి ఎవరూ అలా అనొద్దు ‘ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
దీంతో పవన్ వ్యాఖ్యలపై కార్తీ స్పందించారు. ఈ విషయమై క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘ప్రియమైన పవన్ కళ్యాణ్ సర్.. నా వ్యాఖ్యల వల్ల అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను’ అంటూ కార్తీ ట్వీట్ చేశారు.