Varsham: వర్షంలో ముందుగా అనుకుంది ప్రభాస్‌ని కాదంటా.. ఎవరో తెలుసా.?
Varsham: ప్రభాస్.. ఇప్పుడీ పేరు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఓ సంచలనం. ఈ యంగ్ రెబల్ స్టార్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు ఎక్కడ లేని అంచనాలు ఉంటున్నాయి.
Varsham: ప్రభాస్.. ఇప్పుడీ పేరు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఓ సంచలనం. ఈ యంగ్ రెబల్ స్టార్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు ఎక్కడ లేని అంచనాలు ఉంటున్నాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గతిని మార్చిన హీరోగా ప్రభాస్ అరుదైన గుర్తింపును సంపాదించుకున్నాడు. బాహుబలి, సలార్, కల్కి.. ఇలా ఈ మూడు చిత్రాలతో ప్రభాస్ ఇంటర్నేషనల్ హీరోగా ఎదిగారు.
ఇదిలా ఉంటే ప్రభాస్ కెరీర్‌ను మార్చిన సినిమా ఏది అంటే ఠక్కున వచ్చే సమాధానం వర్షం. ప్రభాస్ కెరీర్‌లో తొలి కమర్షియల్ హిట్ మూవీగా వర్షం పేరు సంపాదించుకుంది. డైరెక్టర్ శోభన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా త్రిష నటించిన విషయం తెలిసిందే. ఇక ఇందులో గోపిచంద్ విలన్ పాత్రలో అద్భుత నటనను కనబరిచారు.
2004లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఏకంగా 95 కేంద్రాల్లో 100 రోజులు ఆడి భారీ విజయాన్ని సొంతం చేసుకుందీ మూవీ. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దర్శకుడు మొదట ప్రభాస్‌ను అనుకోలేదంటా. దర్శకుడు శోభన్ ఈ సినిమా కోసం మొదట సూపర్ స్టార్ మహేష్ బాబును తీసుకోవాలని భావించారంటా. మొదట వర్షం కథను దర్శకుడు మహేష్ వద్దకు తీసుకెళ్లారంటా.
అయితే ఇందుకు మహేష్ కూడా సానుకూలంగానే స్పందించారని, అయితే చివర్లో అనుకోని కారణాల ద్వారా మహేష్ ఈ సినిమాలో నటించలేదని వార్తలు వచ్చాయి. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్లే మహేష్ వర్షం సినిమా చేయలేకపోయారంటా. అయితే ఆ తర్వాత ఈ సినిమా కథ ప్రభాస్ వద్దకు వెళ్లడం, ప్రభాస్ ఇందుకు ఓకే చెప్పడం, సినిమా తెరకెక్కడం అన్ని చకచక సాగిపోయాయి. ప్రభాస్ కెరీర్‌ను మలుపు తిప్పిన వర్షం సినిమా వెనకాల ఉన్న అసలు కథ ఇదన్నమాట.