Bigg Boss 8 Telugu Elimination: ఓటింగ్‌లో ఇదేం అన్యాయం బాస్.. టాప్‌లో విష్ణుప్రియ.. హౌస్ బయటకు బేబక్క..?
Bigg Boss 8 Telugu Elimination: ఈ నెల తొలి ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. ప్రతి సీజన్‌లోనూ సోమవారం నాడు నామినేషన్స్ జరిగితే అదే రోజు రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ మొదలయ్యేవి.
Bigg Boss 8 Telugu Elimination: ఈ నెల తొలి ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. ప్రతి సీజన్‌లోనూ సోమవారం నాడు నామినేషన్స్ జరిగితే అదే రోజు రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ మొదలయ్యేవి. అయితే, ఈ సీజన్‌లో 2 రోజుల పాటు నామినేషన్స్ జరిగాయి. అంటే, మంగళ, బుధవారాల్లో నామినేషన్స్ చేపట్టారు.
అంటే, బుధవారం రాత్రి నుంచి బిగ్ బాస్ ఓటింగ్ లైన్స్ అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం రాత్రి క్లోజ్ అయ్యాయి. ఇలా ఓటింగ్ చేపట్టడం వల్ల బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్‌కి అన్యాయం చేసినట్లే అవుతుంది. గతంలో మాదిరిగా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది తెలియాలి.
కాగా, తొలివారం నామినేషన్స్‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో విష్ణు ప్రియ, శేఖర్ బాషా, సోనియా, బెజవాడ బేబక్క, మణికంఠ, పృథ్వీశెట్టి ఉన్నారు.
మణికంఠను సహచరులంతా టార్గెట్ చేయడంతో అగ్రస్థానంలోకి వచ్చాడు. నామినేషన్స్‌లో అత్యధికంగా పాపులారిటీ ఉంది కేవలం విష్ణు ప్రియకే. అలాగే, శేఖర్ బాషాకు కూడా కాస్తో కూస్తో పాపులారిటీ ఉంది.
ఓవరాల్‌గా ఓటింగ్ పోల్స్ చూస్తే.. మణికంఠకే టాప్ పోషిజన్ ఉంది. తొలిరోజు ఓటింగ్ గమనిస్తే..నాగ మణికంఠకు 28 శాతం, విష్ణు ప్రియకు 26 శాతం ఓట్లు, పృథ్వీకు 12 శాతం, సోనియా ఆకులకు 12 శాతం, శేఖర్ బాషా 10 శాతం, బేబక్క 9 శాతం ఓట్లు సాధించారు. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.