Ramnagar Bunny: 'సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తా'.. చంద్రహాస్ సెన్సేషన్ కామెంట్స్ ..
Ramnagar Bunny: ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా పరిచయవుతోన్న చిత్రం 'రామ్ నగర్ బన్నీ'.
Ramnagar Bunny: ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా పరిచయవుతోన్న చిత్రం 'రామ్ నగర్ బన్నీ'. తొలి చిత్రంతోనే ఆటిట్యూడ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న చంద్రహాస్ సోషల్ మీడియాలో ఇప్పటికే పాపులర్‌గా మారాడు. రామ్ నగర్ బన్నీ మూవీతో అక్టోబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్ మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో చంద్రహాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చూసి మీకు నచ్చకుంటే తనకు మీ టికెట్ ఫొటోతో ఇన్ స్టా ద్వారా చెప్పండి, మీ డబ్బులు కంపల్సరీ గూగుల్ పే చేస్తా. ఎంతమంది పంపింతే అంతమందికి డబ్బులు రిటర్న్ ఇస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. చంద్రహాస్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. "రామ్ నగర్ బన్నీ" సినిమా మంచి కంటెంట్ తో వస్తున్నట్లు టీజర్, ట్రైలర్ తో తెలుస్తోందన్నారు. చంద్రహాస్ ప్రామిసింగ్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడన్న వర్మ... బాగా పర్ ఫార్మ్ చేస్తున్నాడని, ఈ సినిమా చంద్రహాస్ తో పాటు ప్రభాకర్ కు పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాని వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక ప్రభాకర్ మాట్లాడుతూ.. "రామ్ నగర్ బన్నీ" ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తుంటే మా అబ్బాయి ప్రీ వెడ్డింగ్ షూట్ లా అనిపిస్తోంది. మా మూవీని రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ వారికి థ్యాంక్స్ చెబుతున్నాం. వాళ్లు మా సినిమాకు ఎంతో సపోర్ట్ అందిస్తున్నారు. ప్రతి పేరెంట్ మా "రామ్ నగర్ బన్నీ" సినిమా చూడాలి. మీకు తప్పకుండా సినిమా నచ్చుతుంది. సినిమా చూశాక మీరే మరో పదిమందికి మూవీ బాగుందని చెబుతారు. సినిమా సక్సెస్ అయితే ప్రొడ్యూసర్ గా మరిన్ని మూవీస్ చేసే శక్తి లభిస్తుంది. అలాంటి ఆదరణ మీ దగ్గర నుంచి దక్కుతుందని ఆశిస్తున్నాన్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా హాజరైన రాగ్ గోపాల్ వర్మకు హీరో చంద్రహాస్ ధన్యవాదాలు తెలిపారు. 'నాకు హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్నాయని ఆయన చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నాన్న ప్రభాకర్ గారు ఇందాక చెప్పినట్లు ఆయనకు ఎంతమంది సపోర్ట్ చేశారో, అవసరం పడితే నేనూ వాళ్లందరి కోసం పరుగులు పెడుతూ వెళ్తాను. ఈ సందర్భంగా మూడు ప్రామిస్ లు చేస్తున్నా. నేను మాట ఇస్తే తప్పను. నా "రామ్ నగర్ బన్నీ" సినిమా లాభాల్లో 10 శాతం ప్రజలకు ఛారిటీ కోసం ఇచ్చేస్తా.
సినిమా చూసి ఆటిట్యూట్ స్టార్ అనే ట్యాగ్ కు నేను అర్హుడిని కాదంటే నా నెక్ట్ రెండు సినిమాలకు ఆ పేరు పెట్టుకోను. అలాగే మీరు మా "రామ్ నగర్ బన్నీ" సినిమా చూసి మీకు నచ్చకుంటే నాకు మీ టికెట్ ఫొటోతో ఇన్ స్టా ద్వారా చెప్పండి మీ డబ్బులు కంపల్సరీ గూగుల్ పే చేస్తా. ఎంతమంది పంపింతే అంతమందికి డబ్బులు రిటర్న్ ఇస్తా. మిమ్మల్ని ఎప్పుడూ ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటా' అని చెప్పుకొచ్చారు. మరి తొలి సినిమాతోనే మంచి బజ్ క్రియేట్ చేస్తున్న చంద్రహాస్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.